హైదరాబాద్: ఏఐఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. పహల్గామ్ ఉగ్ర దాడిలో మరణించిన 26 మంది ప్రాణాల కంటే డబ్బు విలువైనదా? అని ప్రశ్నించారు. పాకిస్థాన్‌తో క్రికెట్ మ్యాచ్ ఆడటానికి భారత్ జట్టును అనుమతించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఒక కార్యక్రమంలో పాల్గొన్న అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడారు. పహల్గామ్ ఉగ్ర దాడిలో జరిగిన ప్రాణ నష్టం కంటే ఆర్థిక లాభాలు ముఖ్యమా? అని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. ‘అస్సాం ముఖ్యమంత్రి, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, మిగతా వారందరికీ (బీజేపీ నేతలకు) నా ప్రశ్న ఏమంటే, పహల్గామ్లో 26 మంది పౌరులను మతం అడిగి కాల్చి చంపిన పాకిస్థాన్‌తో క్రికెట్ మ్యాచ్ ఆడకుండా తిరస్కరించే అధికారం మీకు లేదా?’ అని నిలదీశారు.
కాగా, పహల్గామ్ ఉగ్ర దాడిలో మరణించిన 26 మంది పౌరుల ప్రాణాల కంటే ఈ మ్యాచ్ ద్వారా సంపాదించిన డబ్బు విలువైనదా? అని అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు. ‘ప్రధానమంత్రిని మేం అడుగుతున్నాం. రక్తం, నీరు కలిసి ప్రవహించలేవని, ఉగ్రవాదం, చర్చలు కలిసి జరుగవని మీరు చెప్పారు. ఒక క్రికెట్ మ్యాచ్ నుంచి బీసీసీఐకి ఎంత డబ్బు వస్తుంది. రూ. 2000 కోట్లా, రూ. 3000 కోట్లా? మన 26 మంది పౌరుల ప్రాణాల కంటే ఈ డబ్బు విలువ ఎక్కువా?’ అని నిలదీశారు. 26 మంది బాధిత కుటుంబాల వెంట తాము నిన్న ఉన్నామని, రేపు కూడా ఉంటామని అన్నారు.
India-Pakistan Match: हमारे 26 भारतीयों की जान की कीमत पैसों से बढ़कर नहीं है pic.twitter.com/NvsmkrOGes
— Asaduddin Owaisi (@asadowaisi) September 14, 2025
Also Read:
Couple Kills Children, Plan To Suicide | సూసైడ్ ప్లాన్‌లో పిల్లలు, భర్త మృతి.. బతికిన భార్య
Watch: పైజామా లేకుండా టీవీ చర్చలో పాల్గొన్న బీజేపీ నేత.. వీడియో వైరల్