ముంబై: బీజేపీ నేత, ఆ పార్టీ అధికార ప్రతినిధి పైజామా ధరించకుండా టీవీ చర్చా కార్యాక్రమంలో పాల్గొన్నారు. (Gaurav Bhatia) ఆయన అర్ధనగ్నంగా కనిపించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఆ బీజేపీ నేతపై ప్రతిపక్ష నేతలు మండిపడ్దారు. సెప్టెంబర్ 12న న్యూస్ 18 టీవీ ఛానల్ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా పాల్గొన్నారు. అమిష్ దేవ్గన్ హోస్ట్‌గా వ్యవహరించిన ‘ఆర్ పార్’ షోలో పాల్గొనే అతిథులను ఆయన పరిచయం చేశారు. ఈ సందర్భంగా గౌరవ్ భాటియా ప్యాంటు లేకుండా కేవలం గులాబీ రంగు కుర్తా మాత్రమే ధరించి కనిపించారు. పైజామా ధరించకుండా అర్ధనగ్నంగా ఉన్న ఆయన తన కుర్తాను సర్దుబాటు చేసుకున్నారు. లైవ్‌లో జరిగిన ఆ చర్చా కార్యాక్రమాన్ని అలాగే కొనసాగించారు.
కాగా, ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు గౌరవ్ భాటియా తీరుపై మండిపడ్డారు. ‘సిగ్గులేని వ్యక్తి, పైజమా లేకుండా అసభ్యకరంగా టీవీ చర్చలో కూర్చున్నాడు. ఆయనకు సిగ్గు అనిపించడం లేదా? గౌరవ్ భాటియా చూపించిన దృశ్యం నిజమైన బీజేపీ పాత్ర. ఈ సిగ్గులేని వ్యక్తులు రోజంతా ఇతరుల గురించి అర్ధంలేని మాటలు మాట్లాడతారు. కానీ వారి సొంత వ్యక్తిత్వం, ప్రవర్తన అందరికీ కనిపించేలా బహిరంగంగా ఉన్నాయి’ అని విమర్శించారు.
మరోవైపు లైవ్ టీవీ కార్యక్రమంలో అశ్లీలతను ప్రదర్శించిన గౌరవ్ భాటియాపై నెటిజన్లు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్ధనగ్నంగా కనిపించిన ఆయనపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఒక మహిళా న్యాయవాది డిమాండ్ చేశారు.
बिना पायजामा के टीवी चैनल डिबेट में बैठे भाजपा के नंगे पुंगे अश्लील किस्म के टोंटी प्रेमी @gauravbhatiabjp को देखिए।
इसे शर्म नहीं? या ये किसी भाजपाई या पड़ोसी के टोंटी से पानी ले रहा था? इस गौरव भाटिया का जो दृश्य आप सबको दिखाई दे रहा है ये ही असली भाजपाई चरित्र है।
ये बेशर्म… pic.twitter.com/rMGVDNzXn4
— Samajwadi Party Media Cell (@mediacellsp) September 12, 2025
Also Read:
Nitesh Rane | ఆదిత్య ఠాక్రే బురఖాలో ఇండియా-పాక్ మ్యాచ్ చూస్తారు: బీజేపీ నేత నితేష్ రాణే
Watch: బ్యాంకులో చోరీ.. డబ్బులున్న బ్యాగ్ ఎత్తుకెళ్లిన యువకుడు