ముంబై: బీజేపీ నేత, మహారాష్ట్ర మంత్రి నితేష్ రాణే (Nitesh Rane) వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. శివసేన (యూబీటీ) నేత ఆదిత్య ఠాక్రే బురఖాలో ఇండియా-పాక్ మ్యాచ్ చూస్తారని ఎగతాళి చేశారు. అంతేకాక పాకిస్థాన్ జిందాబాద్ నినాదాలు కూడా ఆయన చేస్తారని అన్నారు. దుబాయ్‌లో ఇండియా-పాకిస్తాన్ మధ్య జరుగనున్న ఆసియా కప్ మ్యాచ్‌పై వివాదం నెలకొన్నది. ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్ర దాడిలో పాక్ ఉగ్రవాదులు 26 మంది భారత పౌరులను కాల్చి చంపారు. ఈ సంఘటన తర్వాత పాక్‌తో భారత్ జట్టు ఆడాలన్న బీసీసీఐ నిర్ణయాన్ని ఆదిత్య ఠాక్రే ఖండించారు. బీసీసీఐ దేశ వ్యతిరేకిగా మారుతోందని ఆయన విమర్శించారు. ప్రధాని మోదీపై శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే మండిపడ్డారు. ఈ మ్యాచ్‌ను వ్యతిరేకిస్తూ మహారాష్ట్ర అంతటా ‘సిందూర్’ పేరుతో నిరసనలు చేపడతామని ప్రకటించారు.
కాగా, ఆదిత్య ఠాక్రే వ్యాఖ్యలపై బీజేపీ మంత్రి నితేష్ రాణే స్పందించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆదిత్య ఠాక్రే బురఖాలో దాక్కుని క్రికెట్ మ్యాచ్‌ను రహస్యంగా చూస్తారని రాణే ఎగతాళి చేశారు. ‘ఆదిత్య ఠాక్రే రేపు ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్‌ను బురఖాలో దాక్కుని చూస్తాడు. పాకిస్తాన్ జిందాబాద్ నినాదాలు కూడా అతడు చేస్తాడు’ అని ఆరోపించారు. శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ మెరైన్ డ్రైవ్‌లో బ్లాక్ టిక్కెట్లు అమ్ముతారని మంత్రి నితేష్ రాణే అన్నారు. దీంతో ఆయన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తాయి.
VIDEO | Maharashtra minister Nitesh Rane says, “Aaditya Thackeray will watch India-Pakistan match secretly, wearing a burqa…”
(Full video available on PTI Videos – https://t.co/n147TvqRQz)#Maharashtra pic.twitter.com/dUNXdQYS0A
— Press Trust of India (@PTI_News) September 13, 2025
Also Read:
Man On Train Top Electrocuted | రైలు పైకి ఎక్కిన వ్యక్తి.. విద్యుదాఘాతానికి గురై మృతి
Pakistani Doctor | సర్జరీని మధ్యలో వదిలేసి.. నర్సుతో డాక్టర్ శృంగారం