లండన్: ఒక డాక్టర్ సర్జరీని మధ్యలో వదిలేశాడు. టాయిలెట్ బ్రేక్ తీసుకున్నట్లు చెప్పిన అతడు మరో ఆపరేషన్ థియేటర్లోకి వెళ్లాడు. అక్కడ ఒక నర్సుతో శృంగారంలో పాల్గొన్నాడు. (Pakistani Doctor) మరో నర్సు ఇది చూడటంతో ఈ వ్యవహారం బయటపడింది. బ్రిటన్‌లోని గ్రేటర్ మాంచెస్టర్‌లో ఈ సంఘటన జరిగింది. టేమ్సైడ్ జనరల్ హాస్పిటల్లో పాకిస్థాన్‌కు చెందిన 44 ఏళ్ల సుశీల్ అంజుమ్ సీనియర్ అనస్థటిక్ వైద్యుడు. 2023 సెప్టెంబర్ 16న ఆ హాస్పిటల్లో జరిగిన ఐదు ఆపరేషన్లలో ఆ డాక్టర్ పాల్గొన్నాడు.
కాగా, ఆ రోజు మూడో సర్జరీగా ఒక వ్యక్తికి గాల్ బ్లాడర్ ఆపరేషన్ జరిగింది. అయితే సర్జరీ మధ్యలో డాక్టర్ సుశీల్ అంజుమ్ టాయిలెట్ కోసమంటూ 8 నిమిషాలు బ్రేక్ తీసుకున్నాడు. రోగిని చూస్తుండమని ఒక నర్సుకు చెప్పాడు. అయితే టాయిలెట్ రూమ్‌కు బదులు మరో ఆపరేషన్ థియేటర్‌కు వెళ్లాడు. అక్కడ మరో నర్సుతో శృంగారంలో పాల్గొన్నాడు.
మరోవైపు రోగిని చూడమన్న నర్సు అనుకోకుండా ఆ ఆపరేషన్ థియేటర్‌కు వెళ్లింది. అక్కడ మరో నర్సుతో శృంగారంలో పాల్గొన్న డాక్టర్‌ను చూసి ఆమె చూసి షాకయ్యింది. ఆ తర్వాత అక్కడి నుంచి వచ్చిన ఆ డాక్టర్ సర్జరీని తిరిగి కొనసాగించాడు. మిగతా సర్జరీల్లో పాల్గొన్నాడు. అయితే డాక్టర్ సుశీల్ అంజుమ్‌పై హాస్పిటల్ యాజమాన్యానికి ఆ నర్సు ఫిర్యాదు చేసింది. దీంతో టేమ్సైడ్ హాస్పిటల్ అతడ్ని ప్రశ్నించడంతో ఉద్యోగాన్ని వదిలేశాడు. పాకిస్థాన్‌లోని తన సొంతూరులో ప్రస్తుతం నివసిస్తున్నాడు.
కాగా, మెడికల్ ప్రాక్టీషనర్స్ ట్రిబ్యునల్ విచారణలో తన తప్పును డాక్టర్ సుశీల్ అంజుమ్ అంగీకరించాడు. భార్యతో వైవాహిక వివాదం కారణంగా తాను ఒత్తిడికి గురయ్యానని తెలిపాడు. ‘మా కుమార్తె నెలలు నిండకుండా తక్కువ బరుపుతో జన్మించింది. నా భార్యకు చాలా బాధాకరమైన ప్రసవం జరిగింది. ఇది చాలా ఒత్తిడితో కూడిన అనుభవం. ఆ సమయంలో మేం జంటగా కనెక్ట్ కాలేకపోయాం. నా వ్యక్తిగత జీవితం, నా మానసిక ఆరోగ్యం, నా శ్రేయస్సుతోపాటు ఆసుపత్రిలో నా పనిపై ఇది ప్రభావం చూపింది’ అని చెప్పాడు. అలాగే బ్రిటన్‌లో తన వృత్తిని కొనసాగించాలనుకుంటున్నట్లు అతడు వెల్లడించాడు.
Also Read:
Hardik Patel | బీజేపీ ఎమ్మెల్యే హార్దిక్ పటేల్‌పై.. రెండో అరెస్ట్ వారెంట్
Imprisonment To Police Officer | కోర్టు విచారణలకు గైర్హాజరు.. పోలీస్ అధికారికి గంట జైలు శిక్ష
Watch: బ్యారేజీ పైనుంచి నీటిలోకి దూకిన విద్యార్థిని.. తర్వాత ఏం జరిగిందంటే?