చండీగఢ్: కోర్టు విచారణలకు గైర్హాజరైన పోలీస్ అధికారిపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనకు గంట పాటు జైలు శిక్ష విధించారు. (Imprisonment To Police Officer) ఈ నేపథ్యంలో ఆ పోలీస్ అధికారి గంట సేపు జైలు శిక్షను అనుభవించారు. హర్యానాలోని కైతాల్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 2021లో జరిగిన హత్య కేసుపై ఇన్స్పెక్టర్ రాజేష్ కుమార్ దర్యాప్తు చేశారు. ప్రస్తుతం సిర్సా జిల్లాలోని బడాబుధ పోలీస్ స్టేషన్లో ఎస్‌హెచ్‌వోగా ఆయన పనిచేస్తున్నారు.
కాగా, పోలీస్ అధికారి రాజేష్ కుమార్ కోర్టు విచారణలకు పదే పదే గైర్హాజరయ్యారు. ఈ కేసులో సాక్ష్యం చెప్పేందుకు ఆయన కోర్టుకు హాజరుకాలేదు. దీంతో ఆగస్టు 29న ఆ పోలీస్ అధికారిపై కోర్టు నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో గురువారం సాక్ష్యం చెప్పేందుకు ఆయన కోర్టుకు వచ్చారు.
మరోవైపు అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి మోహిత్ అగర్వాల్, దర్యాప్తు అధికారి ఇన్స్పెక్టర్ రాజేష్ కుమార్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టుకు పదే పదే గైర్హాజరైన ఆయనకు గంట పాటు జైలు శిక్ష విధించారు. కోర్టు ప్రాంగణంలోని సెల్లో గంట సేపు ఉంచాలని ఆదేశించారు. దీంతో యూనిఫామ్‌లో ఉన్న పోలీస్ అధికారి రాజేష్ కుమార్‌ను గురువారం ఉదయం 10:30 నుంచి 11:30 వరకు కోర్టు ప్రాంగణంలో ఖైదీల కోసం ఏర్పాటు చేసిన కారాగారంలో ఉంచారు. ఆ తర్వాత ఆయనను కోర్టులో హాజరుపర్చారు. ఈ నేపథ్యంలో పోలీస్ అధికారిపై కోర్టు చర్యలు చర్చకు దారితీసింది.
हरियाणा के कैथल में गुरुवार को एक मामला सामने आया,कोर्ट ने हत्या के केस में बार-बार गैरहाजिर रहने पर जांच अधिकारी को एक घंटे की सजा सुना दी,अदालत ने राजेश कुमार को कोर्ट परिसर में बंदियों के लिए बने लॉकअप में एक घंटे तक रखा राजेश कुमार सिरसा जिले के बड़ागुढा थाने में SHO हैं। pic.twitter.com/WjLooJxrQj
— Mohd Zia Rizvi 🇮🇳 (@Ziarizvilive) September 11, 2025
Also Read:
School Bus Topples | బెంగళూరులో అద్వాన్నంగా రోడ్లు.. గుంతలోకి ఒరిగిపోయిన బస్సు
Watch: రోడ్డుపై చెత్త వేస్తున్న షాపు యజమాని.. అధికారులు ఏం చేశారంటే?
Watch: కదులుతున్న లారీపై చోరీ.. వీడియో వైరల్, ఆరుగురు అరెస్ట్