బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో రోడ్లు అద్వాన్నంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో భారీ గుంతలోకి స్కూల్ బస్సు ఒరిగిపోయింది. (School Bus Topples) స్కూల్ పిల్లలతో వెళ్తున్న ఆ బస్సుకు పెద్ద ప్రమాదం తప్పింది. బెంగళూరులోని చాలా రోడ్లు గుంతలమయంగా ఉన్నాయి. వాహనాల ప్రమాదాలకు నిలయంగా మారాయి. శుక్రవారం ఉదయం గుంతలతో నిండిన పాణత్తూరు-బలగెరె ప్రధాన మార్గంలో రెండు స్కూల్ బస్సులు ప్రయాణించాయి.
కాగా, ఒక స్కూల్ బస్సును దాటి ముందుకు వెళ్లేందుకు మరో స్కూల్ బస్సు ప్రయత్నించింది. అయితే సుమారు 20 మంది విద్యార్థులున్న ఆ స్కూల్ బస్సు రోడ్డు పక్కగా బురదమయంగా ఉన్న గుంతలో కూరుకుపోయింది. సగానికిపైగా బస్సు ఒక పక్కకు ఒరిగిపోయింది. దీంతో అందులో ఉన్న విద్యార్థులు భయాందోళన చెందారు.
మరోవైపు ఇది గమనించిన స్థానికులు వెంటనే ఆ స్కూల్ బస్సు వద్దకు చేరుకున్నారు. విండోల వద్ద ఉన్న ఎమర్జెన్సీ డోర్లు తెరిచారు. ఆ బస్సులో ఉన్న స్కూల్ పిల్లలను సరక్షితంగా బయటకు తెచ్చారు. ఆ స్కూల్ బస్సు వెనుక ఉన్న కారు డ్యాష్ బోర్డు కెమెరాలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
కాగా, ఈ సంఘటన నేపథ్యంలో కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని బెంగళూరులోని రోడ్ల దుస్థితిపై మండిపడ్డారు.
Bengaluru’s roads are no longer just an inconvenience they are a full-blown danger to life. The crater-filled, slushy Panathur–Balagere stretch is a perfect example of the government’s negligence. This morning, a school bus carrying around 20 children nearly toppled over. The… pic.twitter.com/FfsnzMFf3r
— Karnataka Portfolio (@karnatakaportf) September 12, 2025
Also Read:
Physiotherapists | ఫిజియోథెరపిస్టులు వైద్యులు కాదు.. పేరు ముందు ‘డాక్టర్’ వాడొద్దు: డీజీహెచ్ఎస్
Watch: రోడ్డుపై చెత్త వేస్తున్న షాపు యజమాని.. అధికారులు ఏం చేశారంటే?
Watch: కదులుతున్న లారీపై చోరీ.. వీడియో వైరల్, ఆరుగురు అరెస్ట్