Jannik Sinner | చరిత్ర సృష్టించిన ఇటలీ కెరటం.. జకోవిచ్ ‘ఆల్‌టైమ్ రికార్డు’ బద్ధలు కొట్టేశాడు.!
Jannik Sinner : పురుషుల టెన్నిస్‌లో తారాజువ్వలా దూసుకొచ్చిన జన్నిక్ సినర్ (Jannik Sinner) చరిత్ర సృష్టించాడు. చిన్న వయసులోనే అన్ని ప్రధాన హార్డ్ కోర్ట్ టోర్నీల్లో ఛాంపియన్‌గా అవతరించాడు.
Jannik Sinner : పురుషుల టెన్నిస్‌లో తారాజువ్వలా దూసుకొచ్చిన జన్నిక్ సినర్ (Jannik Sinner) చరిత్ర సృష్టించాడు. చిన్న వయసులోనే అన్ని ప్రధాన హార్డ్ కోర్ట్ టోర్నీల్లో ఛాంపియన్‌గా అవతరించాడు. సోమవారం ఇండియన్ వెల్స్ ఫైనల్లో డానిల్ మెద్వెదేవ్ (Daniil Medvedev)ను చిత్తుగా ఓడించిన ఇటలీ కెరటం.. 24 ఏళ్లకే అన్ని హార్డ్కోర్ట్ ఈవెంట్లలో విజేతగా నిలిచాడు. తద్వారా నొవాక్ జకోవిచ్ (Novak Djokovic) పేరిట ఉన్న ఆల్‌టైమ్ రికార్డును అతడు బద్ధలు కొట్టాడు.
ఇండియన్ వెల్స్ ఫైనల్లో సినర్ ధాటికి డానిల్ మెద్వెదేవ్ తేలిపోయాడు. సెమీఫైనల్లో వరల్డ్ నంబర్ 1 కార్లోస్ అల్కరాస్ (Carlos Alcaraz)కు చెక్ పెట్టిన రష్యా ఆటగాడు ఇటలీ స్టార్ దూకుడు ముందు నిలువ లేకపోయాడు. ఈ టోర్నీలో ఒక్క సెట్ కూడా కోల్పోని సినర్.. ఫైనల్లోనూ పంజా విసిరి తో మట్టికరిపించాడు. ఫలితంగా 24 ఏళ్లకే ప్రధాన హార్డ్ కోర్టుల్లో ఛాంపియన్‌గా అవతరించాడీ సంచలనం.
The 25th Jannik Sinner trophy lift.
You’re looking at the youngest man in history to win both hard court Slams and all 6 hard court Masters 1000 titles.
🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆
Racking them up.
— The Tennis Letter (@TheTennisLetter) March 15, 2026
మొట్ట మొదటి ఇండియన్ వెల్స్ ట్రోఫీతోనే సినర్ దిగ్గజాల సరసన చేరాడు. ఇదివరకు జకోవిచ్ 31 ఏళ్లప్పుడు ఈ ఘనత సాధించాడు. కొన్నాళ్లుగా జకో పేరిటే ఉన్న ఈ రికార్డును సినర్ బ్రేక్ చేశాడు. అంతేకాదు అన్ని హార్డ్ కోర్టు 1000 మాస్టర్స్ టోర్నీల్లో విజేతగా నిలిచిన మూడో ఆటగాడిగానూ చరిత్రకెక్కాడు. అతడి కంటే ముందు రోజర్ ఫెదర్, జకోవిచ్ మాత్రమే ఈ మైలురాయిని అధిగమించారు.
THE MOMENT JANNIK SINNER WON HIS FIRST INDIAN WELLS TITLE.
He’s now won every single hard court Masters title at the age of 24…
The youngest in history to do it.
Finger to his heart… that reaction says it all.👉❤️🔥
🥹🥹🥹🥹
— The Tennis Letter (@TheTennisLetter) March 15, 2026
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ 84వ పుట్టినరోజు వేడుకలు.. ముంబైలోని జల్సా వద్ద కోలాహలం
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

