అహ్మదాబాద్: గుజరాత్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే హార్దిక్ పటేల్‌పై (Hardik Patel) అహ్మదాబాద్ కోర్టు రెండో అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. తొలి అరెస్ట్ వారెంట్‌కు ఆయన స్పందించకపోవడంతో కోర్టు ఈ నిర్ణయం తీసుకున్నది. దీంతో పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చాల్సి ఉంటుంది. 2018లో ముందస్తు పోలీసుల అనుమతి లేకుండా అహ్మదాబాద్‌లోని నికోల్‌లో హార్దిక్ పటేల్ నిరాహార దీక్ష చేశారు. దీంతో పోలీసులు ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేశారు.
కాగా, బీజేపీ ఎమ్మెల్యే హార్దిక్ పటేల్ ఈ కేసు విచారణ కోసం కోర్టుకు హాజరుకాలేదు. కోర్టు సమన్లను ఆయన విస్మరించారు. దీంతో ఆగస్ట్ 29న తొలి అరెస్ట్ వారెంట్‌ను కోర్టు జారీ చేసింది. సెప్టెంబర్ 10న కోర్టు ముందు హాజరు కావాలని ఆదేశించింది. అయినప్పటికీ హార్దిక్ పటేల్ కోర్టుకు హాజరుకాలేదు. దీంతో సెక్షన్ 70 కింద కోర్టు రెండో వారెంట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో పోలీసులు ఆయనను అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపర్చాల్సి ఉంటుందని సీనియర్ న్యాయవాది తెలిపారు. దీంతో ఈ అంశం గుజరాత్ రాజకీయాల్లో చర్చనీయంశమైంది.
Also Read:
Imprisonment To Police Officer | కోర్టు విచారణలకు గైర్హాజరు.. పోలీస్ అధికారికి గంట జైలు శిక్ష