Ram Gopal Varma | ఆదిత్య ధర్‌పై రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు.. ఇండస్ట్రీలో అసూయ ఉందంటూ వ్యాఖ్యలు
Ram Gopal Varma | సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి తన కామెంట్స్‌తో హాట్ టాపిక్‌గా మారారు. బాలీవుడ్ దర్శకుడు ఆదిత్య ధర్ ప్రతిభను ప్రశంసిస్తూనే, ఆయనపై ఇండస్ట్రీ అసూయ చూపిస్తుందంటూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి. ఇటీవల ఆదిత్య ధర్ తెరకెక్కించిన ‘ధురంధర్’ సినిమా చూసిన తర్వాత తనకు ఆయనపై భారీ అభిమానం పెరిగిందని రామ్ గోపాల్ వర్మ తెలిపారు
Ram Gopal Varma | సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి తన కామెంట్స్‌తో హాట్ టాపిక్‌గా మారారు. బాలీవుడ్ దర్శకుడు ఆదిత్య ధర్ ప్రతిభను ప్రశంసిస్తూనే, ఆయనపై ఇండస్ట్రీ అసూయ చూపిస్తుందంటూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి. ఇటీవల ఆదిత్య ధర్ తెరకెక్కించిన ‘ధురంధర్’ సినిమా చూసిన తర్వాత తనకు ఆయనపై భారీ అభిమానం పెరిగిందని రామ్ గోపాల్ వర్మ తెలిపారు. ఆ చిత్రంలోని మేకింగ్, టేకింగ్ తనను ఎంతగానో ఆకట్టుకుందని పేర్కొన్నారు. ఆదిత్య ధర్ తన ప్రత్యేక శైలితో సినిమా మేకింగ్‌ను పూర్తిగా కొత్త దిశలోకి తీసుకెళ్లారని వర్మ ప్రశంసించారు. అయితే ఇదే సమయంలో పరిశ్రమలో ఆయనపై అసూయ కూడా పెరుగుతోందని వర్మ వ్యాఖ్యానించారు.
ఆదిత్య ధర్ తీసుకొచ్చిన కొత్త తరహా మేకింగ్ వల్ల పలు భారీ యాక్షన్ చిత్రాల టీమ్‌లు తమ సినిమాల షూటింగ్‌లను ఆపేసి రీ-షూటింగ్ చేయాల్సి వస్తోందని చెప్పారు. దీంతో కొందరు నిర్మాతలు నష్టపోతున్నారని, అందుకే ఆదిత్య ధర్ ,ఆయన భార్య యామీ గౌతమ్ పతనం కోసం కొందరు వేచి చూస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ వర్గాల్లో పెద్ద చర్చకు దారి తీస్తున్నాయి. రామ్ గోపాల్ వర్మ చేసిన ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో కూడా విభిన్న స్పందనలు వ్యక్తమవుతున్నాయి.ఇక ‘ధురంధర్’ సినిమా విషయానికి వస్తే, బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.1300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి రికార్డు సృష్టించింది.
ఈ విజయంతో ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘ధురంధర్: ది రివెంజ్’ తెరకెక్కుతోంది. ఈ చిత్రం మార్చి 19న విడుదలకు సిద్ధమవుతోంది. మొదట ఈ సినిమా కన్నడ స్టార్ యష్ నటిస్తున్న ‘టాక్సిక్’తో ఒకేరోజు విడుదల కావాల్సి ఉంది. అయితే ఆ సినిమా వాయిదా పడటంతో ఇప్పుడు పవన్ కళ్యాణ్ నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’తో బాక్సాఫీస్ పోటీకి సిద్ధమవుతోంది. ఒకేరోజు రెండు భారీ సినిమాలు విడుదల కావడం వల్ల ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. దీంతో మార్చి 19న బాక్సాఫీస్ వద్ద ఏ సినిమా పైచేయి సాధిస్తుందో అనే ఉత్కంఠ సినీ అభిమానుల్లో నెలకొంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

