కాంగ్రెస్ పాలనలో కమీషన్ల దందా!
కాంగ్రెస్ హయాంలో కమీషన్ల దందా జోరుగా సాగుతున్నదనే ఆరోపణలున్నాయి. కమీషన్ల కోసం ఏకంగా అభివృద్ధి పనులనే అడ్డుకుంటున్నా రని పలువురు మండిపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత ఏడాదిపాటు నయాపైసా కేటాయించకుండా ఇబ్బందులకు గురిచేసి.. తదనంతరం మంజూరు చేసిన అభివృద్ధి పనులకూ మోకాలడ్డు వేస్తున్నాదనే ఆరోపణలున్నాయి.
- ప్రతి పనికీ డబ్బులు వసూలు చేస్తున్నారని కాంగ్రెస్ ప్రజాప్రతినిధులపై ఆరోపణలు
- కమీషన్ ఇవ్వలేక పరిగి-వికారాబాద్ రోడ్డు పనులను మధ్యలోనే నిలిపేసిన కాంట్రాక్టర్
- గత రెండు, మూడు నెలలుగా నిలిచిపోయిన విస్తరణ పనులు
- కమీషన్ల కోసం అభివృద్ధిని అడ్డుకుంటున్నారని జిల్లావాసుల మండిపాటు
- గుంతల రోడ్లతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న వాహనదారులు
వికారాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ హయాంలో కమీషన్ల దందా జోరుగా సాగుతున్నదనే ఆరోపణలున్నాయి. కమీషన్ల కోసం ఏకంగా అభివృద్ధి పనులనే అడ్డుకుంటున్నా రని పలువురు మండిపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత ఏడాదిపాటు నయాపైసా కేటాయించకుండా ఇబ్బందులకు గురిచేసి.. తదనంతరం మంజూరు చేసిన అభివృద్ధి పనులకూ మోకాలడ్డు వేస్తున్నాదనే ఆరోపణలున్నాయి. గతేడాది మార్చిలో మంత్రులు శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిలు శంకుస్థాపన చేసిన పరిగి-వికారాబాద్ నాలుగు లేన్ల రోడ్డు విస్తరణ పనులు నిలిచిపోయా యి. మొదట్లో ఆ పనులు వేగంగా సాగినా.. గత మూడు, నాలు గు నెలలుగా నెమ్మదించాయి. అలాగే, పరిగి నుంచి వికారాబాద్ వరకు మధ్యలో బ్రిడ్జిల నిర్మాణం కూడా తుది దశ చేరుకోవడంతోపాటు రోడ్డు పనులు పరిగి-నస్కల్ దాటే వరకు వేగంగా జరిగి మరో ఐదారు నెలల్లో ఒకవైపు పూర్తవుతుందనుకున్న సమయంలో సడన్‌గా ఆ పనులకు బ్రేక్ పడింది.
ఆ పనులు మధ్యలోనే ఆగిపోయేందుకు ప్రధాన కారణం కమీషన్లంటూ ప్రచారం జరుగుతున్నది. ఈ పనులను దక్కించుకున్న కాం ట్రాక్టర్‌ను కమీషన్ల కోసం ప్రజాప్రతినిధులు వేధింపులకు గురి చేయడంతోనే అర్ధాంతరంగా నిలిపేసినట్టు తెలిసింది. కాంట్రాక్టర్ నుంచి రూ.కోట్లలో కమీషన్‌ను డిమాండ్ చేయడంతోనే పెద్ద మొత్తంలో ఇవ్వలేకనే పనులను ఆపేసినట్టు రాజకీయ వర్గాల్లో విమర్శలు వినిపిస్తున్నాయి. కమీషన్ల కోసం రోడ్డు విస్తరణ పనులను అడ్డుకుంటున్నారనే ఆరోపణలతో రెండు నియోజకవర్గాల ఎమ్మెల్యేలపై ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారు. పరిగి నుంచి వికారాబాద్ వైపు నస్కల్ వరకు రోడ్డు విస్తరణ పనులు ప్రారంభమై ఒకవైపు 70 శాతం మేర పూర్తికాగా, వికారాబాద్ నియోజకవర్గ పరిధిలో మాత్రం భూసేకరణ మినహా పనులు ప్రారంభం కాకపోవడం
నిలిచిన రోడ్డు విస్తరణ పనులు..
కాంగ్రెస్ పాలనలో అవినీతి పెరిగిపోయింది. అలవి కాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కార్ ఒక్క హామీని కూడా నెరవేర్చక అన్ని వర్గాలను మోసం చేయడంతోపాటు అభివృద్ధి పనులకు మోకాలడ్డు వేస్తున్నదనే ఆరోపణలున్నాయి. ఉద్యోగుల పోస్టింగులు మొదలుకొని డిప్యుటేషన్లు, నెలనెలా మామూళ్లు అంటూ అందిన కాడికి దోచుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. మరోవైపు బీఆర్ఎస్ హయాంలో మంజూరైన పనులను కావాలనే జాప్యం చేస్తున్నారనే ప్రచారమూ జరుగుతున్నది. జిల్లా కేంద్రంలో ఆర్వోబీ నిర్మాణానికి బీఆర్ఎస్ హయాంలోనే నిధులు మంజూరు కాగా.. ఆ వంతెన పనులు 32 నెలలు దాటినా కనీసం అడుగు ముందుకు పడకపోవడం గమనార్హం.
గతేడాది మార్చిలో సుమారు రూ.160 కోట్లు మంజూరు చేసి మంత్రులు శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిలు పరిగి-వికారాబాద్ నాలుగు లేన్ల రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన చేయగా పరిగి నుంచి నస్కల్ వరకు పనులు జరిగినా వికారాబాద్ నియోజకవర్గ పరిధిలో అస్సలు పనులు ప్రారంభం కాకపోవడం గమనార్హం. వికారాబాద్ పట్టణంలోని ఎన్నెపల్లి నుంచి కలెక్టరేట్ మీదుగా రోడ్డు విస్తరణకు భూ సేకరణ పూర్తి చేసి దాదాపు ఏడాది దాటుతున్నా పనులను ప్రారంభించడంలో మాత్రం రాజకీయ గ్రహణం పట్టినట్టు పలువురు విమర్శిస్తున్నారు. ఓ వైపు కొడంగల్ నియోజకవర్గంలో రూ. వేల కోట్లతో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతుండగా.. జిల్లాలోని మిగతా మూడు నియోజకవర్గాలకు ఇచ్చిన అరకొర నిధులతో జరిగే అభివృద్ధిని స్థానిక ప్రజాప్రతినిధులు కమీషన్ల పేరిట అడ్డుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
తీవ్ర ఇబ్బందుల్లో వాహనదారులు..
పరిగి-వికారాబాద్ రోడ్డు విస్తరణ పనులు ఎక్కడిక్కడ నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పరిగి నుంచి వికారాబాద్ వరకు నస్కల్, మద్గుల్ చిట్టంపల్లి, పాత కలెక్టరేట్ వద్ద బ్రిడ్జిల నిర్మాణం జరుగుతుండగా పక్కన తాత్కాలిక రోడ్డును ఏర్పాటు చేశారు. ఇటీవల కురిసిన వర్షానికి తాత్కాలిక రోడ్డు కొట్టుకుపోవడంతో పరిగి-వికారాబాద్ మధ్య ఒకట్రెండు రోజులు రాకపోకలు నిలిచిపోయాయి. కేవలం సింగిల్ రోడ్డు కావడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని చోట్ల సింగిల్ రోడ్డు పూర్తిగా గుంతలు, కంకర తేలడంతో భయం భయంతో ప్రయాణించాల్సిన దయనీయ పరిస్థితి నెలకొంది.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI | భారత్‌తో మూడో టీ20.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్
Pakistan | పాకిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.. పీటీఐ ప్రభుత్వం రద్దు.. సీఎం అరెస్ట్
Agriculture Admissions | వ్యవసాయ కోర్సుల్లో మిగిలిన సీట్లకు కౌన్సెలింగ్.. ఈ నెల 14 నుంచి ప్రారంభం
Kadapa DSP | కడప డీఎస్పీగా భవానీ భాధ్యతల స్వీకరణ
MLC Dasoju Shravan Kumar | ఈ ప్రభుత్వానికి ఎంప్లాయింట్ పాలసీనే లేదు : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

