కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) ఖరగ్‌పూర్ (IIT Kharagpur) యూటర్న్ తీసుకున్నది. క్యాంపస్‌లోని హాస్టల్ డైనింగ్ హాల్లో వెజ్, నాన్-వెజ్ విద్యార్థులకు వేర్వేరుగా సీటింగ్ కోసం జారీ చేసిన నోటీసును రద్దు చేసింది. హాస్టల్ విద్యార్థులతోపాటు పూర్వ విద్యార్థుల నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో వెనక్కి తగ్గింది. ఆగస్ట్ 16న బీఆర్ అంబేద్కర్ డైనింగ్ హాల్లో శాఖాహారం, మాంసాహారం విద్యార్థుల కోసం విడిగా సీటింగ్ కేటాయించారు. విద్యార్థులు ఆ మేరకు ఆయా సీట్లలో కూర్చోవాలని నోటీస్ జారీ చేశారు.
కాగా, క్యాంపస్‌లోని హాస్టల్స్‌లో నివసించే విద్యార్థులు ఈ చర్యను విమర్శించారు. ఈ విషయం తెలిసిన పూర్వ విద్యార్థులు కూడా దీనిని తప్పుపట్టారు. ఈ చర్య విద్యార్థుల మధ్య విభజనకు దారి తీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఐఐటీ ఖరగ్‌పూర్ యాజమాన్యం వెనక్కి తగ్గింది. బీఆర్ అంబేద్కర్ డైనింగ్ హాల్లో వెజ్, నాన్ వెజ్ విద్యార్థులకు ప్రత్యేక సీటింగ్ నోటీసును సెప్టెంబర్ 8న రద్దు చేసింది.
మరోవైపు ఉన్నత అధికారులకు తెలియకుండా ఈ నోటీసు జారీ అయ్యిందని ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ సుమన్ చక్రవర్తి తెలిపారు. దీని గురించి తెలిసిన వెంటనే ఉన్నతాధికారులను సంప్రదించి ఆ నోటీస్‌ను రద్దు చేసినట్లు చెప్పారు. విద్యాసంస్థలో ఆహార ప్రాధాన్యతల ఆధారంగా ఎలాంటి విభజన ఉండకూడదని ఆయన అన్నారు.
Also Read:
Imprisonment To Police Officer | కోర్టు విచారణలకు గైర్హాజరు.. పోలీస్ అధికారికి గంట జైలు శిక్ష
School Bus Topples | బెంగళూరులో అద్వాన్నంగా రోడ్లు.. గుంతలోకి ఒరిగిపోయిన బస్సు
Watch: రోడ్డుపై చెత్త వేస్తున్న షాపు యజమాని.. అధికారులు ఏం చేశారంటే?