Sonam Wangchuk: సోనమ్ వాంగ్‌చుక్ రిలీజ్‌కు ప్రభుత్వం ఆదేశాలు
Sonam Wangchuk : సోనమ్ వాంగ్చుక్ను రిలీజ్ చేయనున్నారు. ఆర్నెళ్ల క్రితం అతన్ని లేహ్‌లో అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. జాతీయ భద్రతా చట్టం కింద అతన్ని అరెస్టు చేశారు. తక్షణమే రిలీజ్ చేయాలని కేంద్ర హోంశాఖ ఆదేశాలు ఇచ్చింది.
న్యూఢిల్లీ: సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ను రిలీజ్ చేయనున్నారు. ఆర్నెళ్ల క్రితం అతన్ని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. జాతీయ భద్రతా చట్టం కింద అతన్ని అరెస్టు చేశారు. లేహ్‌లో జరుగుతున్న అల్లర్ల నేపథ్యంలో సోనమ్ వాంగ్చుక్ను ప్రభుత్వం అదుపులోకి తీసుకున్నది. అయితే లడాఖ్‌లో శాంతి, స్థిరత్వం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని, అన్ని వర్గాలతో నిర్మాణాత్మక చర్చలు నిర్వహించే ఉద్దేశంతో ఉన్నట్లు ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొన్నది. ఈ నేపథ్యంలో సోనమ్‌పై ఉన్న నిర్బంధాన్ని తక్షణమే ఎత్తివేయాలని కేంద్ర హోంశాఖ నిర్ణయించినట్లు ప్రభుత్వం వెల్లడించింది.
2025, సెప్టెంబర్ 24వ తేదీన లేహ్‌లో అల్లర్లు చోటుచేసుకున్నాయి. శాంతి, భద్రతలు క్షీణించాయి. ఈ నేపథ్యంలో ఎన్ఎస్ఏ చట్టం కింద 2025, సెప్టెంబర్ 26వ తేదీన సోనమ్‌ను అరెస్టు చేశారు.లేహ్ జిల్లా మెజిస్ట్రేట్ ఆదేశాల ప్రకారం అతన్ని అదుపులోకి తీసుకున్నారు. లడాఖ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు అన్ని విధాలు ప్రయత్నం చేస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొన్నది. బంద్‌లు, నిరసనలో ప్రాంతం నిర్వీర్యం అవుతున్న నేపథ్యంలో హైపవర్ కమిటీ ద్వారా సమస్యలను పరిష్కరించనున్నట్లు చెప్పింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AB de Villiers | వయసు పైబడినా చేవ తగ్గలే.. 37 బంతుల్లోనే డివిలియర్స్ శతకమోత..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడు ఈదురు జనార్ధన్ కుటుంబానికి అండగా కేటీఆర్.. వీడియో
KTR Letter | రేడియల్ రోడ్ 2 టెండర్లలో జరిగిన రూ. 3,296 కోట్ల కుంభకోణంపై సమాధానం చెప్పాలి : రేవంత్‌కు కేటీఆర్ లేఖ
విద్యుత్ తీగలకు అడ్డమని పచ్చని చెట్ల నరికివేత
బోండాల కోసం కొబ్బరి చెట్టు నరికివేత.. వ్యక్తి పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!

