Sigma Movie | తండ్రి పాలిటిక్స్, కొడుకు సినిమాకు బ్రేక్?.. ‘సిగ్మా’ విడుదలపై సందిగ్ధత.!
Jason Sanjay Movie | కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ రాజకీయ అరంగేట్రం ఇప్పుడు టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ సినిమాపై ఊహించని ప్రభావం చూపుతోంది. విజయ్ తనయుడు జేసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయమవుతున్న మొదటి సినిమా 'సిగ్మా' (Sigma) విడుదల వాయిదా పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Sigma Movie | కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ రాజకీయ అరంగేట్రం ఇప్పుడు టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ సినిమాపై ఊహించని ప్రభావం చూపుతోంది. విజయ్ తనయుడు జేసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయమవుతున్న మొదటి సినిమా ‘సిగ్మా’ (Sigma). ఈ సినిమా విడుదల వాయిదా పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ హై-ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ షూటింగ్ ఇప్పటికే పూర్తయినప్పటికీ, విజయ్ తన రాజకీయ పార్టీ ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) పనుల్లో బిజీగా ఉండటం మరియు ఆయన వ్యక్తిగత జీవితం చుట్టూ ఉన్న తాజా పరిణామాల నేపథ్యంలో మేకర్స్ వెనక్కి తగ్గినట్లు సమాచారం. ఈ సమయంలో సినిమాను విడుదల చేస్తే మీడియా నుండి ఎదురయ్యే రాజకీయ సంబంధిత ప్రశ్నలు జేసన్ సంజయ్‌ను ఇబ్బంది పెడతాయని, అది సినిమాపై ఉన్న శ్రద్ధను పక్కదారి పట్టిస్తుందని నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ భావిస్తోంది.
మొదట ఈ చిత్రాన్ని 2025 చివరలో విడుదల చేయాలని భావించినప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాతే థియేటర్లలోకి తీసుకురావాలని నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి. ఎస్.ఎస్. తమన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు ఉండగా, తాజా రాజకీయ పరిణామాల వల్ల ఈ సినిమా విడుదల ఆలస్యం కావడం సందీప్ కిషన్ అభిమానులను కాస్త నిరాశకు గురిచేస్తోంది. విజయ్ రాజకీయ తుపాను తగ్గిన తర్వాతే జేసన్ సంజయ్ తన దర్శకత్వ ప్రతిభను వెండితెరపై ప్రదర్శించే అవకాశం కనిపిస్తోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

