లక్నో: ఒక విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. బ్యారేజీ పైనుంచి నీటిలోకి దూకింది. ఇది చూసి అక్కడున్న వారు షాకయ్యారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. (ITI Student Jumps Into Barrage) ఉత్తరప్రదేశ్‌లోని సహరాన్పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. రతన్‌పురా కళ్యాణ్పూర్ గ్రామానికి చెందిన 19 ఏళ్ల ఐటీఐ విద్యార్థిని గురువారం మధ్యాహ్నం హత్నికుండ్ బ్యారేజీ వద్దకు వచ్చింది. కొంత సేపు మొబైల్ ఫోన్లో మాట్లాడింది. ఆ తర్వాత అకస్మాత్తుగా కాలువ వైపు తిరిగింది. వెనుకకు నడుస్తూ నీటిలోకి ఆమె దూకింది.
కాగా, అక్కడున్న ముగ్గురు యువకులు ఆ యువతిని రక్షించేందుకు ప్రయత్నించారు. తాళ్లతో నీటిలోకి దూకారు. అయితే బలమైన నీటి ప్రవాహంలో ఆ అమ్మాయి కొట్టుకుపోయింది. సమాచారం అందుకున్న ప్రతాప్ నగర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కాలువలో గాలింపు చర్యలు చేపట్టారు. నాలుగు గంటల తర్వాత యువతి మృతదేహాన్ని కాలువ నుంచి బయటకు తీశారు.
మరోవైపు ఆ యువతి బ్యాగ్‌లో ఉన్న ఆధార్ కార్డు, ఇతర పత్రాల ఆధారంగా మృతురాలిని శివానీగా గుర్తించారు. ఆమె కుటుంబానికి సమాచారం ఇచ్చారు. పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఆ యువతి బ్యారేజీ పైనుంచి కాలువలోకి దూకిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Also Read:
ये जिंदगी ना मिलेगी दोबारा!#सहारनपुर की शिवानी (18) नहर में कूदकर जान दे दी
वह कूदने के लिए रैंप पर खड़ी थी. लोग उसे समझाते रहे वह नही मानी. सिर को स्कार्फ से ढक. पानी कूद गयी. रस्सा फैंका गया, लड़के नहर में भी कूदे. मगर वह पानी में बैठ गयी. शव बरामद है pic.twitter.com/t06Vi3IJq5
— Narendra Pratap (@hindipatrakar) September 12, 2025
Also Read:
Hardik Patel | బీజేపీ ఎమ్మెల్యే హార్దిక్ పటేల్‌పై.. రెండో అరెస్ట్ వారెంట్
Imprisonment To Police Officer | కోర్టు విచారణలకు గైర్హాజరు.. పోలీస్ అధికారికి గంట జైలు శిక్ష