Sikh woman raped In UK | బ్రిటన్‌లో సిక్కు యువతిపై అత్యాచారం.. నీ దేశానికి తిరిగి వెళ్లాలని బెదిరింపు
Sikh woman raped In UK | బ్రిటన్‌కు చెందిన సిక్కు యువతిపై ఆ దేశానికి చెందిన ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమెపై జాత్యహంకార వ్యాఖ్యలు చేశారు. ఆ యువతి బ్రిటన్‌కు చెందిన వ్యక్తి కాదని, ఆమె దేశానికి తిరిగి వెళ్లాలని అత్యాచారానికి ముందు ఆ వ్యక్తులు బెదిరించారు.
లండన్: బ్రిటన్‌కు చెందిన సిక్కు యువతిపై ఆ దేశానికి చెందిన ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. (Sikh woman raped In UK) ఆమెపై జాత్యహంకార వ్యాఖ్యలు చేశారు. ఆ యువతి బ్రిటన్‌కు చెందిన వ్యక్తి కాదని, ఆమె దేశానికి తిరిగి వెళ్లాలని అత్యాచారానికి ముందు ఆ వ్యక్తులు బెదిరించారు. మంగళవారం ఉదయం 8.30 గంటలకు వెస్ట్ మిడ్‌ల్యాండ్స్ ఓల్డ్బరీలోని టేమ్ రోడ్ వద్ద ఉన్న పార్కులో 20 ఏళ్ల సిక్కు యువతిని ఇద్దరు శ్వేతజాతీయులు అడ్డుకున్నారు. ఆమెపై జాత్యహంకార వ్యాఖ్యలు చేశారు. ఆ సిక్కు యువతి బ్రిటన్‌కు చెందిన మహిళ కాదని, ఆమె దేశానికి తిరిగి వెళ్లాలని బెదిరించారు. అంతేగాక ఆ సిక్కు యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
కాగా, బాధిత సిక్కు యవతి ఫిర్యాదుపై వెస్ట్ మిడ్‌ల్యాండ్స్ పోలీసులు స్పందించారు. జాత్యహంకార దాడిగా, ద్వేషపూరిత నేరంగా పరిగణిస్తున్నామని తెలిపారు. శ్వేతజాతీయులైన అనుమానితుల కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. ఇద్దరు నిందితులకు సంబంధించిన సమాచారం, సీసీటీవీ ఫుటేజ్, డ్యాష్‌క్యామ్ ఫుటేజ్, మొబైల్ ఫుటేజ్ వంటి ఆధారాలు అందించి సహకరించాలని ప్రజలను కోరారు.
మరోవైపు బ్రిటన్‌లోని సిక్కు సమాజం ఈ సంఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటీవల కాలంలో జాత్యహంకార సంఘటనలు పెరుగడంపై సిక్కు ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. లేబర్ పార్టీ ఎంపీ ప్రీత్ కౌర్ గిల్ ఈ దాడిని ఖండించారు. ‘తీవ్ర హింస, జాత్యహంకార చర్య’ అని అభివర్ణించారు. ‘ఆమె ఈ దేశానికి చెందిన మహిళ. బ్రిటన్ లేదా ఓల్డ్‌బరీలో ఎక్కడా జాత్యహంకారం, స్త్రీ ద్వేషానికి స్థానం లేదు. సిక్కు సమాజానికి న్యాయం జరిగేలా, వారి భద్రతను మెరుగుపరచడానికి పోలీసులతో కలిసి పనిచేస్తా’ అని ఎక్స్‌లో పేర్కొన్నారు.
Also Read:
Pakistani Doctor | సర్జరీని మధ్యలో వదిలేసి.. నర్సుతో డాక్టర్ శృంగారం
Watch: బ్యారేజీ పైనుంచి నీటిలోకి దూకిన విద్యార్థిని.. తర్వాత ఏం జరిగిందంటే?
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

