భువనేశ్వర్: స్కూల్ హాస్టల్లో నిద్రిస్తున్న స్టూడెంట్స్ కళ్లలో తోటి విద్యార్థులు ఫెవిక్విక్ పోశారు. (Fevikwik in Students eyes) దీంతో వారి కళ్లు అంటుకుపోవడంతో తెరువలేకపోయారు. బాధిత స్టూడెంట్స్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. కంటికి గాయమైన వారికి చికిత్స అందిస్తున్నారు. ఒడిశాలోని కంధమాల్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. సలాగూడలోని సెబాశ్రమ్ స్కూల్ హాస్టల్‌కు చెందిన కొందరు విద్యార్థులు ఆకతాయి పనికి పాల్పడ్డారు. శుక్రవారం రాత్రి హాస్టల్ రూమ్‌లో నిద్రిస్తున్న 8 మంది విద్యార్థుల కళ్లలో ఫెవిక్విక్ పోశారు. ముగ్గురు స్టూటెంట్స్ కళ్లు అంటుకుపోవడంతో తెరువలేకపోయారు.
కాగా, ఈ విషయం తెలుసుకున్న స్కూల్ హాస్టల్ సిబ్బంది వెంటనే స్పందించారు. 8 మంది విద్యార్థులను తొలుత గోచ్చపాడ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం ఫుల్బానిలోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు.
మరోవైపు ఫెవిక్విక్ వల్ల ఆ విద్యార్థుల కళ్లకు నష్టం కలిగిందని డాక్టర్లు తెలిపారు. అయితే సకాలంలో వారిని హాస్పిటల్‌కు తీసుకురావడంతో చికిత్స అందించినట్లు చెప్పారు. ఒక విద్యార్థిని డిశ్చార్జ్ చేయగా మిగతా ఏడుగురు స్టూడెంట్స్‌ను పరిశీలనలో ఉంచినట్లు వెల్లడించారు. సంక్షేమ శాఖ అధికారులు ఆసుపత్రిని సందర్శించి ఆ విద్యార్థులను పరామర్శించారు.
ఈ సంఘటనపై దర్యాప్తునకు జిల్లా కలెక్టర్ ఆదేశించారు. స్కూల్ హెడ్మాస్టార్ మనోరంజన్ సాహును సస్పెండ్ చేశారు. హాస్టల్ లోపల ఈ సంఘటన ఎలా జరిగింది అన్నది దర్యాప్తు చేస్తున్నారు. సూపరింటెండెంట్‌తో సహా వార్డెన్లు, సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు. హాస్టల్లో ఉన్న పిల్లలు ఫెవిక్విక్ ఎక్కడ నుంచి తెచ్చారు? తోటి విద్యార్థుల కళ్లలో ఆ జిగురు పోయడం వెనుక వారి ఉద్దేశం ఏమిటి? అన్నది దర్యాప్తు చేస్తున్నారు.
Also Read:
Man On Train Top Electrocuted | రైలు పైకి ఎక్కిన వ్యక్తి.. విద్యుదాఘాతానికి గురై మృతి
Pakistani Doctor | సర్జరీని మధ్యలో వదిలేసి.. నర్సుతో డాక్టర్ శృంగారం