ముంబై: రైల్వే స్టేషన్లో ఆగి ఉన్న రైలు బోగి పైకి ఒక వ్యక్తి ఎక్కాడు. హైటెన్షన్ విద్యుత్ వైర్‌కు అతడు తగలడంతో విద్యుదాఘాతానికి గురై మరణించాడు. (Man On Train Top Electrocuted) ఆ రైల్వే స్టేషన్లో ఉన్న ప్రయాణికులు ఇది చూసి షాక్ అయ్యారు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో నాగ్‌పూర్ రైల్వే స్టేషన్‌లోని ఆగి ఉన్న ట్రైన్ కోచ్‌పైకి ఒక వ్యక్తి ఎక్కాడు. దానిపై అతడు నిలబడి ఉన్నాడు.
కాగా, ఇది చూసి ప్లాట్‌ఫారమ్‌పై ఉన్న ప్రయాణికులు ఆందోళన చెందారు. కిందకు దిగి రావాలని కొందరు కేకలు వేశారు. అయితే వారి మాటలను ఆ వ్యక్తి వినిపించుకోలేదు. ఆ తర్వాత ఆ యువకుడు ప్రమాదవశాత్తూ హైటెన్షన్ వైర్ తాకాడు. దీంతో విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. రైలు కంపార్ట్మెంట్ పైనుంచి కింద పడి మరణించాడు.
మరోవైపు రైల్వే పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ వ్యక్తి
మానసిక పరిస్థితి సరిగా లేదా? లేక సోషల్ మీడియా రీల్ కోసం ట్రైన్ కంపార్ట్మెంట్ పైకి ఎక్కి పోజులిచ్చేందుకు అతడు ప్రయత్నించాడా? లేక ఆత్మహత్యకు పాల్పడ్డాడా? అన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడ్ని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.
Also Read:
Pakistani Doctor | సర్జరీని మధ్యలో వదిలేసి.. నర్సుతో డాక్టర్ శృంగారం
Watch: బ్యారేజీ పైనుంచి నీటిలోకి దూకిన విద్యార్థిని.. తర్వాత ఏం జరిగిందంటే?