హైదరాబాద్, మార్చి 12(నమస్తే తెలంగాణ) : గ్రూప్-1 సర్వీసెస్ ద్వారా నూతనంగా ఎంపికైన ప్రొబేషనరీ డిప్యూటీ కలెక్టర్లకు ఎంసీఆర్హెచ్ఆర్డీలో శిక్షణ కొనసాగుతున్నది. ఇందులో భాగంగానే వారికి రిటైర్డ్ జాయింట్ కలెక్టర్లు పొద్దాటి సురేశ్, రాజారాం, రామకృష్ణ శిక్షణ తరగతులు నిర్వహించారు.
ఈ సందర్భంగా వారికి రెవెన్యూ చట్టాలు, భూ సమస్యల పరిష్కార విధానాలు, నూతన ఆర్వోఆర్ చట్టం, భూముల రకాలపై అవగాహన కల్పించారు. రెవెన్యూ ఉద్యోగులుగా నిర్వర్తించాల్సిన విధులు, కర్తవ్యంపై వారికి అవగాహన కల్పించారు.