అహం వీడితేనే..
ఎవ్వరూ వేరెవరి కంటే కూడా గొప్పవారు కారు. ఒకరికన్నా గొప్పవారు ఉండరు. ఎందుకంటే అందరూ దైవాధీనులే అన్న విషయం గుర్తించుకోవాలి. మానవుడు ఎంత సాధించినా, అసంపూర్ణుడే! దేవుడు మాత్రమే పరిపూర్ణుడు. మిగిలినవన్నీ ఆ దైవశక్తిలో అసమగ్రమైన భాగాలే. ప్రతి మనిషికీ ఆత్మాభిమానం ఉండొచ్చు కానీ, అహంకారం ఉండగూడదు.
ఎవ్వరూ వేరెవరి కంటే కూడా గొప్పవారు కారు. ఒకరికన్నా గొప్పవారు ఉండరు. ఎందుకంటే అందరూ దైవాధీనులే అన్న విషయం గుర్తించుకోవాలి. మానవుడు ఎంత సాధించినా, అసంపూర్ణుడే! దేవుడు మాత్రమే పరిపూర్ణుడు. మిగిలినవన్నీ ఆ దైవశక్తిలో అసమగ్రమైన భాగాలే. ప్రతి మనిషికీ ఆత్మాభిమానం ఉండొచ్చు కానీ, అహంకారం ఉండగూడదు. తాను చేసే పనిమీద గట్టి నమ్మకం, చేపట్టిన కార్యాన్ని తప్పక నెరవేర్చుకోగలను అన్న విశ్వాసమే ఆత్మాభిమానం. దానికి తగ్గట్టుగానే శ్రమించాలి. నమ్మిన దేవుడ్ని దానికి ముందుంచి అనుకున్న లక్ష్యం వైపు మున్ముందుకు సాగిపోవాలి. ఇక్కడ సద్గుణాల సమ్మేళనంతోపాటు తనపై, తాను నమ్మిన దైవంపై ప్రగాఢ విశ్వాసం ప్రకటితమవుతుంది. దీనికి భిన్నమైంది, నేను అనే భావం!! ‘నేనే సర్వం, సర్వజ్ఞుడను నేనే’ అని విర్ర వీగడం అహం. ‘నన్ను మించిన వాడు లేనే లేడు. ఇంకెక్కడా ఉండకూడదు’ అనుకోవడం అహంకారం.
ఇది వినాశన హేతువు. ‘దేవుడు అహంకార ద్వేషి’ అంటుంది క్రీస్తు ధర్మం (సామెతలు 8:13). దైవం వాక్కు పట్ల అవిధేయత, నిర్లక్ష్యం.. ఈ రెండూ అహంకారానికి బిడ్డల్లాంటివి. ప్రజలకు మేలు కార్యాలు తలపెట్టడానికి ఇష్టపడని దుష్టుడే ‘దేవుడు లేడ’ని పేలుతుంటాడు. ఇది అహంకృతితో సాగే విషయమే. కనుక ఈ పాపానికి పుట్టినిల్లు అహంకారమే అని చెబుతుంది దావీదు కీర్తన (10:4). ‘నాశనమునకు ముందు గర్వము నడచును. పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడచును’ అని సోలోమన్ రాజు సామెతలు (16:18) చెబుతున్నది. సాతాను కూడా ఒకా నొకప్పుడు దైవ సన్నిధిలో ఉన్నవాడే! అవిధేయత, తిరుగుబాటు, అహంకారం వల్లే అతను స్వర్గంలో ఉండే అర్హత కోల్పోయాడు. అందుకే, అహం వీడితేనే ప్రభువు ఆశీస్సులు పొందే అర్హత లభిస్తుంది.
క్రీస్తు సందేశం
..? ప్రొ॥బెర్నార్డ్ రాజు, 98667 55024
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mokshagna | మోక్షజ్ఞ డెబ్యూ మూవీలో కాజోల్.. బాలకృష్ణతో కలిసి కీలక పాత్రలో కనిపించనున్నారా?
Irumudi | రవితేజ ‘ఇరుముడి’ నిర్మాతలకు తెలంగాణ కార్మిక శాఖ నోటీసులు.. బాలనటి నిబంధనలపై విచారణకు ఆదేశం!
Software employee | భారీ సిమెంట్ పైపులను ఢీ కొట్టిన కారు.. సాఫ్ట్ వేర్ ఉద్యోగిని దుర్మరణం
Raptadu incident | వరుసకు బాబాయ్..! పెళ్లి చేసుకోవాలని బాలికపై ఒత్తిడి, రాప్తాడు ఘటనలో కీలక విషయాలు
Prakash Raj | ప్రకాష్ రాజ్‌కు సినిమా అవకాశాలు తగ్గడానికి కారణం అదేనా.. సంచలన విషయాలు బయటపెట్టిన భార్య
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

