ఆరు గ్యారెంటీల పేరుతో వంచన
ఆరు గ్యారెంటీల పేరుతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను నిలువునా వంచించిందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ మండిపడ్డారు. దీంతో ఈ రేండున్నరేళ్ల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు పూర్తిగా నమ్మకం కోల్పోయారని అన్నారు.
- ఈ రెండున్నరేళ్లలో ప్రభుత్వంపై ప్రజలు నమ్మకం కోల్పోయారు
- బీఆర్ఎస్ రఘునాథపాలెం ముఖ్య నేతల సమావేశంలో మాజీ మంత్రి అజయ్‌కుమార్
రఘునాథపాలెం, జూలై 26: ఆరు గ్యారెంటీల పేరుతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను నిలువునా వంచించిందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ మండిపడ్డారు. దీంతో ఈ రేండున్నరేళ్ల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు పూర్తిగా నమ్మకం కోల్పోయారని అన్నారు.
రఘునాథపాలెం మండలం ఈర్లపూడి గ్రామంలో ఆదివారం ఏర్పాటుచేసిన బీఆర్ఎస్ ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం తథ్యమన్నారు. గడిచిన రెండున్నర ఏళ్ల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం తన మోసపు విధానాలను కొనసాగిస్తూనే ఉందని విమర్శించారు. దీంతో ఈ ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మే పరిస్థితి లేకుండా పోయిందని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో రేవంత్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే, బీఆర్ఎస్ బలోపేతంలో పార్టీ శ్రేణులు శక్తివంచన లేకుండా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు ఆర్జేసీ కృష్ణ, గుత్తా రవి, బచ్చు విజయ్‌కుమార్, మెంటం రామారావు, మాదంశెట్టి హరిప్రసాద్, మద్దినేని వెంకటరమణ, చెరుకూరి ప్రదీప్, భుక్యా లక్ష్మణ్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

