భువనేశ్వర్: వివాహిత మహిళ ఇద్దరు వ్యక్తులతో కలిసి బైక్పై మార్కెట్కు వెళ్లింది. అయితే
ఆ ఇద్దరిలో బంధువైన వ్యక్తితో ఆమెకు సంబంధం ఉందని కుటుంబ సభ్యులు అనుమానించారు. ఈ నేపథ్యంలో గ్రామస్తులతో కలిసి ఆ ముగ్గురిని విద్యుత్ స్తంభానికి కట్టేసి కొట్టారు. (Men, Woman Tied To Pole, Thrashed) ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. కాశీపూర్ గ్రామానికి చెందిన మహిళకు పెళ్లి కావడంతోపాటు ఇద్దరు పిల్లలున్నారు. అయితే ఇద్దరు వ్యక్తులతో కలిసి బైక్పై జాశీపూర్లో జరిగే వారపు మార్కెట్కు ఆమె వెళ్లింది.
కాగా, ఆ ముగ్గురు బైక్పై గ్రామానికి తిరిగి వస్తుండగా ఆ మహిళ అత్తింటి వారు చూశారు. ఆ ఇద్దరిలో సోదరుడి వరుసయ్యే వ్యక్తితో ఆమెకు వివాహేతర సంబంధం ఉన్నట్లు వారు అనుమానించారు. దీంతో గ్రామస్తులతో కలిసి ఆ ముగ్గురిని విద్యుత్ స్తంభానికి కట్టేశారు. ఒకరి తర్వాత ఒకరు వరుసగా వారిని కొట్టారు. వారి ముఖాలపై పంచులివ్వడంతోపాటు కర్రలతో బాదారు.
మరోవైపు ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ గ్రామానికి చేరుకున్నారు. విద్యుత్ స్తంభానికి కట్టేసి కొట్టిన మహిళ, ఇద్దరు వ్యక్తులను రక్షించి విడిపించారు. గాయపడిన ఆ ముగ్గురిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.
Also Read:
Nitesh Rane | ఆదిత్య ఠాక్రే బురఖాలో ఇండియా-పాక్ మ్యాచ్ చూస్తారు: బీజేపీ నేత నితేష్ రాణే
Man On Train Top Electrocuted | రైలు పైకి ఎక్కిన వ్యక్తి.. విద్యుదాఘాతానికి గురై మృతి
Watch: బ్యాంకులో చోరీ.. డబ్బులున్న బ్యాగ్ ఎత్తుకెళ్లిన యువకుడు