అమరావతి : వైఎస్సార్( YSR) కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా విలువలు, విశ్వసనీయతకు కట్టుబడి ఉంటుందని ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి( YS Jagan Mohan Reddy) అన్నారు. పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను గురువారం తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను ఎగురవేసి కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు.
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి అకాల మరణంతో ప్రజల నుంచి ఉద్బవించిన పార్టీ వైసీపీ అని పేర్కొన్నారు. ఆనాడు కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు కలిసి కుట్రలు, కుతంత్రాలు చేసి పార్టీని నష్టపరిచే ప్రయత్నం చేసినా నాయకులు, కార్యకర్తలు ఇచ్చిన అండదండలు, ప్రోత్సహంతో అధికారంలోకి వచ్చి పేదల అభ్యున్నతే లక్ష్యంగా పనిచేశామని అన్నారు.
కష్టకాలంలో వెనక్కి తగ్గకుండా పార్టీ కోసం నిలబడుతున్నారని , పార్టీపై నమ్మకం పెట్టుకుని, అధినేతపై నమ్మకం ఉంచి పార్టీ కోసం నిలిచిన మీరే పార్టీకి అసలైన బలం.. నా బలమని ట్విటల్లో పేర్కొన్నారు. 11 ఏండ్ల పార్టీ రాజకీయ ప్రయాణం మాత్రమే కాదని, ఒక లక్ష్యంతో లక్షలాది మంది కార్యకర్తల కష్టం, నమ్మకం, త్యాగాలకు నిలువెత్తు సాక్ష్యమని వెల్లడించారు.