న్యూఢిల్లీ: బీహార్‌లో షాకింగ్ ఘటన జరిగింది. జిల్లా కోర్టు పరీక్షల కోసం ఓ అభ్యర్థి అప్లికేషన్ దరఖాస్తు చేసుకోగా, అతనికి వచ్చిన హాల్‌టికెట్‌పై కుక్క ఫోటో ఉన్నది. దీంతో బీహార్ జిల్లా కోర్టు పరీక్షా విధానంపై విమర్శలు వెల్లువెత్తాయి. వివరాల్లోకి వేళ్తే.. రితేశ్ కుమార్ అనే అభ్యర్థి నాలుగేళ్ల క్రితం సివిల్ కోర్టులో ప్యూన్ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అడ్మిట్ కార్డు(Admit Card)లో కుక్క ఫోటో చూసి షాక్ తిన్నాడు. హాల్‌టికెట్‌ను డౌన్లోడ్ చేసిన తర్వాత తన ఫోటో స్థానంలో కుక్క ఫోటో ఉన్నట్లు గుర్తించానన్నారు. ఈ ఫోటో చూసి తాను షాక్‌కు గురైనట్లు చెప్పాడు.
కోర్టు పరీక్షలు నిర్వహిస్తున్న రిక్రూట్మెంట్ బోర్డుకు ఫిర్యాదు చేశాడు. తప్పును సవరించాలని అతను డిమాండ్ చేశాడు. మార్చి 15వ తేదీన బీహార్ సివిల్ కోర్టు రిక్రూట్మెంట్ పరీక్షలను నిర్వహించనున్నారు. ఆ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు అడ్మిట్ కార్డుతో పాటు ఏదైనా గుర్తింపు కార్డును కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది.