భోపాల్: ఒక యువకుడు బ్యాంకులో చోరీకి పాల్పడ్డాడు. కస్టమర్ పరధ్యానంగా ఉండటాన్ని గమనించాడు. డబ్బులున్న అతడి బ్యాగ్‌ను 30 సెకన్లలో ఎత్తుకెళ్లాడు. సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. (Youth Steals Cash Bag From Bank) మధ్యప్రదేశ్‌లోని బేతుల్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. నీలిరంగు టీ షర్టు, బ్లాక్ ప్యాంటు ధరించిన ఒక యువకుడు బ్యాంకులో కలియతిరిగాడు. ఒక టేబుల్ కింద ఉంచిన క్యాష్ బ్యాగును చూశాడు. కస్టమర్ పరధ్యానంగా ఉండటంతో డబ్బులున్న ఆ బ్యాగు తీసుకుని మెల్లగా బ్యాంకు నుంచి జారుకున్నాడు. 30 సెకన్లలోపు ఈ చోరీకి పాల్పడ్డాడు.
కాగా, తన క్యాష్ బ్యాగ్ కనిపించకపోవడంతో ఆ కస్టమర్ ఆందోళన చెందాడు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు ఆ బ్యాంకు వద్దకు చేరుకున్నారు. సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. ఆ క్యాష్ బ్యాగ్‌ను ఒక యువకుడు చోరీ చేసినట్లు తెలుసుకున్నారు.
మరోవైపు పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడ్ని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా, బ్యాంకులోని సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
दिनदहाड़े Bank के अंदर चोरी, चोर ने 30 सेकंड में उड़ाया बैग | Hind First
Madhya Pradesh के Betul से चौंकाने वाला मामला सामने आया है। यहां Punjab National Bank में एक शातिर चोर ने दिनदहाड़े सिर्फ 30 सेकंड में ग्राहक का पैसों से भरा बैग चुरा लिया। वारदात बैंक के अंदर ही हुई और… pic.twitter.com/V7x4NQRFPO
— Hind First (@Hindfirstnews) September 13, 2025
Also Read:
Nitesh Rane | ఆదిత్య ఠాక్రే బురఖాలో ఇండియా-పాక్ మ్యాచ్ చూస్తారు: బీజేపీ నేత నితేష్ రాణే
SUV Jumps Footpath | షాపుల మెట్లపైకి దూసుకెళ్లిన కారు.. తర్వాత ఏం జరిగిందంటే?
Man On Train Top Electrocuted | రైలు పైకి ఎక్కిన వ్యక్తి.. విద్యుదాఘాతానికి గురై మృతి