ముంబై: అదుపుతప్పిన కారు షాపుల మెట్లపైకి దూసుకెళ్లింది. (SUV Jumps Footpath) ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. ఇద్దరు మహిళలు, ఒక వ్యక్తి ఆ కారు నుంచి కిందకు దిగారు. వారంతా మద్యం మత్తులో ఉన్నారు. మద్యం బాటిల్స్ కూడా ఆ కారులో కనిపించాయి. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ సంఘటన జరిగింది. శనివారం ఉదయం 6.30 గంటలకు ముంబైలోని ఘాట్కోపర్ ప్రాంతంలో కియా సెల్టోస్ కారు అదుపుతప్పింది. బారికేడ్‌ను ఢీకొట్టి ఫుట్‌పాత్‌ను దాటుకుని షాపుల మెట్లపైకి దూసుకెళ్లింది. ఒక షాపు గోడను ఢీకొట్టిన తర్వాత ఆ కారు ఆగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.
కాగా, ఈ సంఘటన తర్వాత ఇద్దరు మహిళలు, ఒక వ్యక్తి ఆ కారు నుంచి కిందకు దిగారు. ఆ ముగ్గురు మద్యం మత్తులో ఉన్నారు. ఆ వ్యక్తి అక్కడి నుంచి పారిపోయాడు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ కారును తనిఖీ చేయగా అందులో లిక్కర్ బాటిల్స్ కనిపించాయి. పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. కారులో ఉన్న వారు మద్యం మత్తులో ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేశారు.
మరోవైపు పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కారు ప్రమాదానికి కారణమైన పారిపోయిన వ్యక్తి కోసం వెతుకుతున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. కాగా, ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
A speeding car lost control on LBS Road in #Ghatkopar,breaking through a barricade and crashing into a shop,4 people sustained injuries and were rushed to a nearby hospital@MumbaiPolice detained 2 people from the spot and car absoconding after the incidents #CCTV@ians_india pic.twitter.com/3ZLwNuSaj7
— Indrajeet chaubey (@indrajeet8080) September 13, 2025
A speeding car rammed into multiple shops on a footpath in Mumbai’s Ghatkopar, at nearly 6 am today.
3 people are reported to be seriously injured.
Locals say there were two women and a man in the car, all under the influence of alcohol. pic.twitter.com/lSQ6PzL8mG
— Vani Mehrotra (@vani_mehrotra) September 13, 2025
Also Read:
Nitesh Rane | ఆదిత్య ఠాక్రే బురఖాలో ఇండియా-పాక్ మ్యాచ్ చూస్తారు: బీజేపీ నేత నితేష్ రాణే
Man On Train Top Electrocuted | రైలు పైకి ఎక్కిన వ్యక్తి.. విద్యుదాఘాతానికి గురై మృతి