గంగమ్మ జారుతోంది!.. ముంచుకొస్తున్న నీటి ముప్పు
జూరాల ప్రాజెక్టులో రోజురోజుకూ నీరు ఇంకి పోతున్నది. దీంతో ఈ వేసవిలో ప్రజలకు తాగునీటి, రైతులకు సాగునీటి తిప్పలు తప్పేలా లేవు. డ్యాంలో నీటిమట్టం తగ్గుతుండగా.. అక్కడి నుంచే జోగుళాంబ గద్వాల జిల్లాలోని గ్రామాలకు మిషన్ భగీరథ ద్వారా నీరు సరఫరా అవుతుంది.
- గణనీయంగా తగ్గుతున్న భూగర్భ జలం
- అడుగంటుతున్న ప్రాజెక్టులు, చెరువులు
- గద్వాల జిల్లాలో వట్టిబోతున్న బోర్లు
- పల్లెల్లో మొదలైన మంచినీటి ఎద్దడి
- తుమ్మిళ్లలో ఫిల్టర్ చేయకుండా నది నుంచి నేరుగా నీటి సరఫరా
- పట్టించుకోని అధికార గణం
సాగునీటి ముప్పు ముంచుకొస్తున్నది. వేసవి ప్రారంభంలోనే ప్రమాద ఘంటికలు మోగు తున్నాయి. కరువు మొదలవగా.. భూగర్భ జలాలు క్రమ క్రమంగా పాతాళానికి పడిపోతున్నాయి. జోగుళాంబ గద్వాల జిల్లాలో గణనీయంగా భూగర్భ జలం తగ్గుతుండడంతో ఇప్పటికే ప్రాజెక్టులు, రిజ ర్వాయర్లు, చెరువులు వట్టిబోతున్నాయి. బోరు బావుల్లో నీటిమట్టం వేగంగా తగ్గుతుండడంతో ఆశలు అడుగంటుతున్నాయి. పల్లెల్లో మంచినీటి ఎద్దడి మొదలైంది. పాత బోర్లకు మరమ్మతులు చేస్తున్నారు. తుమ్మిళ్ల వద్ద తుంగభద్ర నది నీటిని ఫిల్టర్ చేయకుండానే నేరుగా సరఫరా చేస్తున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. దీనికితోడు యాసంగి పంటల సాగు సైతం ప్రశ్నార్థకంగా మారింది. కేసీఆర్ ప్రభుత్వంలో సాగునీటి పరవళ్లు కొనసాగితే.. రేవంత్ పాలనలో అరిగోస పడ్తున్నామని రైతులు వాపోయారు.
– గద్వాల, మార్చి16
జూరాల ప్రాజెక్టులో రోజురోజుకూ నీరు ఇంకి పోతున్నది. దీంతో ఈ వేసవిలో ప్రజలకు తాగునీటి, రైతులకు సాగునీటి తిప్పలు తప్పేలా లేవు. డ్యాంలో నీటిమట్టం తగ్గుతుండగా.. అక్కడి నుంచే జోగుళాంబ గద్వాల జిల్లాలోని గ్రామాలకు మిషన్ భగీరథ ద్వారా నీరు సరఫరా అవుతుంది. అయితే ఈసారి దాహార్తి త ప్పదేమోనన్న సందేహాలు వ్యక్తమవుతున్నా యి. తాగునీటి ఎద్దడిని ఎదుర్కోవడానికి అధికారులు ఇప్పటి నుంచే ప్రణాళిక రూపొందించుకొని అడుగులు వేయాల్సి ఉన్నది. లేదంటే వేసవి గండం గట్టెక్కే పరిస్థితిని కనిపించడం లేదు.
గత వేసవిలో జూరాల ప్రాజెక్టు డెడ్ స్టోరేజీకి చేరుకోవడంతో సాగు, తాగునీటి కోసం కర్ణాటకపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొన్నది. అప్పుడు అధికారులు, పాలకులు కర్ణాటక ప్రభుత్వాన్ని 5 టీఎంసీలు విడుదల చేయాలని కోరితే వారు 2 టీఎంసీలు కూడా విడుదల చేయలేదు. చివరి ఆయకట్టుకు నీరు అందక రైతులు ఇబ్బంది పడడంతోపాటు తాగునీటి కష్టాలు ఎదురయ్యాయి. ప్రస్తుతం వేసవి ప్రారంభమైన వేళ ప్రజలకు తాగునీటి కష్టాలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం అధికారులపై ఉన్నది.

తాగునీటి ఇబ్బందులు ఎదుర్కొనే ప్రాంతాలు ఇవే..
గద్వాల జిల్లాలో ఈ వేసవిలో కొన్ని ప్రాంతాలు తాగునీటి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తున్నది. గద్వాల పట్టణంలో గంజిపేట, జమ్మిచేడ్, రాఘవేంద్రకాలనీ, పిల్లిగుండ్ల తదితర కాలనీల్లో నీటి సమస్య ఉన్నది. నీరు సక్రమంగా సరఫరా కాకపోవడంతో ప్రజలు నల్లాల దగ్గర బిందెలు పెట్టుకొని నీటికోసం పడిగాపులు గాయాల్సిన పరిస్థితి నెలకొంది. ధరూర్ మండలంలో నీలహళ్లి, కొత్తపాలెం గ్రామాల్లో నీటిఎద్దడి నెలకొంది. మల్దకల్ మండలంలో మద్దెలబండ గ్రామంలో గత పది రోజులుగా మిషన్ భగీరథ నీరు ట్యాంకుకు ఎక్కకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. అయిజ మండలం చిన్నతాండ్రపాడు గ్రామంలో ప్రజలకు నీటిని అందించే నీటిని ఫిల్టర్ వాటర్ కోసం వినియోగించడంతో నీరు వృథాగా పోతుండడంతో కొన్ని కాలనీల్లో నీటి సరఫరా కాక గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు.
రాజోళి మండలం తుమ్మిళ్ల గ్రామానికి సగభాగం మాత్రమే మిషన్ భగీరథ నీరు సరఫరా అవుతున్నది. మిగతా సగం గ్రామానికి తుంగభద్ర నది నుంచి నీరు సరఫరా అవుతుంది. నదిలో నీరు తగ్గిపోవడంతో గ్రామానికి నీరు సరి పోవడం లేదు. దీంతో తమకు మిషన్ భగీరథ నీళ్లు అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు. గట్టు మండలం సల్కాపురం, జోగన్‌గట్టు, గంగిమాన్‌దొడ్డి గ్రామాలకు మిషన్ భగీరథ నీరు సక్రమంగా అందకపోవడంతో గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు.
ఉండవెల్లి మండలం మారమునగాల-1, మారమునగాల-2 గ్రామాల్లో మిషన్ భగీరథ నీటి కోసం వాటర్ ట్యాంకులు ఏర్పాటు చేసినా నీరు ట్యాంకులకు ఎక్కక పోవడంతో ఆయా గ్రామాల ప్రజలు నీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలంపూర్ మండల కేంద్రంలో సక్రమంగా నీటి సరఫరా కాక గత రెండు రోజుల నుంచి వాటర్ ట్యాంక్ ద్వారా నీటి సరఫరా చేశారు. అధికారులు స్పందించి అన్ని కాలనీలకు నీరు అందించేందుకు చర్యలు తీసుకోవాలని పట్టణవాసులు కోరుతున్నారు.
చాలా రోజులుగా నీటి సమస్య..
గ్రామంలో చాలా రోజులుగా నీటి సమస్య ఉన్నది. గతంలో ఏర్పాటు చేసిన మిషన్ భగీరథ ఓహెచ్‌ఆర్ వాటర్ ట్యాంక్‌కు నీరు అందడం లేదు. వారానికి ఒకసారి మాత్రమే నీరు అందుతుంది. ప్రజలు తాగునీటికి ఇబ్బంది పడుతున్నారు. గ్రామం మొత్తం ఒకే బోరు ఉంది. ఆ బోరు నుంచి వచ్చే నీటితో ప్రజల అవసరాలు తీరడం లేదు. బోరుకు ఏర్పాటు చేసిన పైప్‌లైన్ చాలా చోట్ల లీకులు పడి నీరు పంపింగ్ కావడం లేదు. కొత్త పైప్‌లైన్ కోసం అధికారులు అంచనాలు తయారు చేశారు. పాత పైప్‌లైన్‌ను మార్చి కొత్త పైప్‌లైన్ వేసి నీటి సమస్యకు పరిష్కారం చూపాలి.
– రాంబాబు, మారమునగాల-1 సర్పంచ్, అలంపూర్ మండలం
మిషన్ భగీరథ నీరు రావడం లేదు
గ్రామానికి మిషన్ భగీరథ నీరు సరఫరా కావడం లే దు. గ్రామానికి మొ త్తం ఒకే బోరు ఉంది. దీని వల్ల గ్రామం మొ త్తానికి సరిపడా నీరు పం పిణీ చేయలేక పోతున్నాం. ఈ విషయం పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకపోయాం. గ్రామంలో 1200వందల మంది వరకు జనాభా ఉన్నది. వేసవిలో నీటి ఎద్దడి తీవ్ర ంగా మారే అవకాశం ఉంది. అధికారులు స్పం దించి గ్రామానికి మిషన్ భగీరథ నీరు సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలి.
– సురేశ్‌గౌడ్, మారమునగాల-2 సర్పంచ్,
నది నుంచి నేరుగా నీటి సరఫరా..
గ్రామంలో 990 మంది జనాభా ఉ న్నది. మూడు ఓ హెచ్ఆర్ ట్యాంకు లు ఉన్నా ఒక ట్యాం కు ద్వారా మాత్రమే మిషన్ భగీరథ నీటిని వి డుదల చేస్తున్నారు. మిగతా ట్యాంకులకు నేరుగా తుంగభద్ర నది నీటిని ఎక్కించి నేరుగా పబ్లిక్ నల్లాలకు వదు లుతున్నారు. దీంతో నీరు ఫిల్టర్ కాకపోవడంతో నీరు రంగు మారాయి. నదిలో నీరు తగ్గడంతో ఎద్దడి తలెత్తే అవకాశం ఉంది. అధికారులు చర్యలు చేపట్టి భగీరథ నీటిని అందించాలి.
– బలరాంరెడ్డి, తుమ్మిళ్ల
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Navaratri Brahmotsavams | మోహినీ అలంకారంలో జగన్మోహనాకారుడిగా దర్శనమిచ్చిన శ్రీ మలయప్పస్వామి
Armoor | ఆర్మూర్ 10వ వార్డులో డ్రైనేజీ అస్తవ్యస్తం.. ఇబ్బంది పడుతున్న జనం
Ranabali Review | ‘రణబాలి’ మూవీ రివ్యూ: విజయ్ దేవరకొండ బాక్సాఫీస్ పూనకం.!
Ramayana | విజువల్ వండర్‌గా ‘రామాయణం’ కొత్త ట్రైలర్.. శ్రీరాముడిగా రణ్‌బీర్, రావణాసురుడిగా యశ్ అదుర్స్!
AP News | వైసీపీ వాహనాలకు నిప్పు పెట్టిన దుండగులు.. రాయచోటిలో తీవ్ర ఉద్రిక్తత
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

