ఎమోషన్స్‌తో కూడిన ఏజ్‌గ్యాప్ లవ్‌స్టోరీ
తమిళ అగ్ర నటుడు సూర్య ప్రధాన పాత్రలో నటిస్తున్న తెలుగు పానిండియా సినిమా ‘విశ్వనాథ్ అండ్ సన్స్'. మమితాబైజు కథానాయిక. వెంకీ అట్లూరి దర్శకుడు. సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మాతలు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. జూలైలో ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం ఈ సినిమా టీజర్‌ని విడుదల చేశారు.
తమిళ అగ్ర నటుడు సూర్య ప్రధాన పాత్రలో నటిస్తున్న తెలుగు పానిండియా సినిమా ‘విశ్వనాథ్ అండ్ సన్స్’. మమితాబైజు కథానాయిక. వెంకీ అట్లూరి దర్శకుడు. సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మాతలు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. జూలైలో ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం ఈ సినిమా టీజర్‌ని విడుదల చేశారు.
40ఏళ్ల వయసులో కూడా తన కలలను వదలకుండా ముందుకు సాగే, అంతర్జాతీయ పిస్టల్ షూటర్ సంజయ్ విశ్వనాథ్‌గా సూర్యని ఈ టీజర్ పరిచయం చేసింది. తండ్రి ప్రేమ, భావోద్వేగాలతో కూడుకున్న గాఢమైన పాత్రలో ఇందులో ఆయన కనిపించనున్నట్టు టీజర్ చెబుతున్నది. వెంకీ అట్లూరి ప్రభావవంతమైన సంభాషణలు, సూర్య నటన, కథకు కొత్తదనాన్ని జోడించిన మమితా బైజు పాత్ర టీజర్‌కు ప్రత్యేక ఆకర్షణలుగా నిలిచాయి.
వయస్సు అంతరంతో కూడిన అసాధారణ ప్రేమకథ ఇదని టీజర్ చెబుతోంది. సార్, లక్కీభాస్కర్ చిత్రాల తర్వాత రానున్న ఈ వెంకీ అట్లూరి చిత్రం కచ్చితంగా ప్రేక్షకుల మనసుల్ని గెలుస్తుందని నిర్మాతలు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. రాధిక శరత్‌కుమార్, రవీనా టాండన్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: నిమిష్ రవి, సంగీతం: జి.వి.ప్రకాశ్‌కుమార్, సమర్పణ: శ్రీకర స్టూడియోస్, నిర్మాణం: సితార ఎంటర్టైన్మెట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్‌రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

