Farooq Abdullah | ‘ఫరూఖ్ అబ్దుల్లాను 20 ఏళ్లుగా చంపాలనుకుంటున్నా’.. దర్యాప్తులో దుండగుడి వెల్లడి
Farooq Abdullah | జమ్ముకశ్మీర్ (Jammu Kashmir) మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అధ్యక్షుడు (NC chief) ఫరూఖ్ అబ్దుల్లా (Farooq Abdullah) పై బుధవారం హత్యాయత్నం జరిగింది. ఆయన ఓ పెళ్లి వేడుకలో పాల్గొని, వేదిక నుంచి తిరిగి వస్తుండగా ఓ దుండుగుడు ఆయనపై పాయింట్ బ్లాంక్ రేంజ్ నుంచి కాల్పులు జరిపేందుకు ప్రయత్నించాడు.
Farooq Abdullah : జమ్ముకశ్మీర్ (Jammu Kashmir) మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అధ్యక్షుడు (NC chief) ఫరూఖ్ అబ్దుల్లా (Farooq Abdullah) పై బుధవారం హత్యాయత్నం జరిగింది. ఆయన ఓ పెళ్లి వేడుకలో పాల్గొని, వేదిక నుంచి తిరిగి వస్తుండగా ఓ దుండుగుడు ఆయనపై పాయింట్ బ్లాంక్ రేంజ్ నుంచి కాల్పులు జరిపేందుకు ప్రయత్నించాడు. కానీ వెంటనే సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమై పక్కకు లాగడంతో బుల్లెట్ గురితప్పింది. తాను 20 ఏళ్లుగా ఫరూఖ్ అబ్దుల్లాను హత్య చేయాలనుకుంటున్నానని పోలీసుల దర్యాప్తులో దుండగుడు వెల్లడించడం గమనార్హం.
ఘటనా స్థలంలోనే దుండగుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అతడు జమ్ములోని పురాని మండి ప్రాంతానికి చెందిన 63 ఏళ్ల కమల్ సింగ్ జమ్వాల్‌గా గుర్తించారు. పోలీసుల దర్యాప్తు సందర్భంగా నిందితుడు.. తాను 20 ఏళ్లుగా ఫరూఖ్ అబ్దుల్లాను చంపాలని చూస్తున్నానని చెప్పినట్లు వెల్లడించారు.
‘నేను ఫరూఖ అబ్దుల్లాను చంపాలని 20 ఏళ్లుగా చూస్తున్నా. ఇప్పుడు నాకు ఆ అవకాశం దొరికంది. కానీ అతడు చావలేదు. అతడు బతికిపోయాడు’ అని పోలీసులు దర్యాప్తులో నిందితుడు చెప్పాడు. ఎందుకు చంపాలనుకుంటున్నావని ప్రశ్నించగా నా వ్యక్తిగత కారణం ఉందని అన్నాడు. పిస్టల్ ఎవరిది అని ప్రశ్నించగా తనదే అని పేర్కొన్నాడు.
బుధవారం పెళ్లికి హాజరైన ఫరూఖ్ అబ్దుల్లా.. జమ్ముకశ్మీర్ ఉప ముఖ్యమంత్రి సురిందర్ చౌధరి, ముఖ్యమంత్రి సలహాదారు నజీర్ అస్లాం వాని, ఇతర నేషనల్ కాన్ఫరెన్స్ నాయకులతో కలిసి వేదిక నుంచి తిరిగి వస్తుండగా కమల్ సింగ్ హత్యాయత్నం చేశాడు. ఫరూక్ అబ్దుల్లా మెడపై పిస్తోల్ గురిపెట్టాడు. వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ అతడిని లాగేయడంతో బుల్లెట్ గురితప్పింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gautam Gambhir: ప్రమాదంలో బౌలర్ల కెరీర్: గౌతం గంభీర్
YS Jagan | చంద్రబాబు గారూ ఇప్పటికైనా బీసీలకు క్షమాపణ చెప్పండి.. వైఎస్ జగన్ డిమాండ్
Kamal Hassan | దేశ విధానాలను బిలియనీర్లు నిర్దేశించలేరు.. ఎలాన్ మస్క్‌కు కమల్ హాసన్ కౌంటర్..!
Srinidhi Shetty | ఒక్కో సినిమాకు రూ.8 కోట్లు తీసుకుంటున్నానా .. ప్రచారాలపై శ్రీనిధి శెట్టి క్లారిటీ..!
Rajanna Sircilla | చెరువులో మునిగి యువకుడి మృతి.. తండ్రికి దూరమైన ముగ్గురు చిన్నారులు!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

