Rahul Gandhi | పరిస్థితి దిగజారకముందే మేల్కోండి.. ఎల్పీజీ కొరతపై కేంద్రానికి రాహుల్ గాంధీ సూచన
Rahul Gandhi : దేశంలో ఎల్పీజీ సిలిండర్ల కొరత ఇంకా పెరగకముందే కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. గురువారం ఢిల్లీలో పార్లమెంట్ ప్రాంగణంలో ఈ అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు.
Rahul Gandhi : దేశంలో ఎల్పీజీ సిలిండర్ల కొరత ఇంకా పెరగకముందే కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. గురువారం ఢిల్లీలో పార్లమెంట్ ప్రాంగణంలో ఈ అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఎల్పీజీ సిలిండర్ల కొరత వేధిస్తున్న సంగతి తెలిసిందే. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత భారీ స్థాయిలో ఉంటే, గృహ వినియోగదారులకు కూడా తగిన స్థాయిలో సిలిండర్లు దొరకడం లేదు. ఈ నేపథ్యంలో కేంద్రంలోని ప్రతిపక్షం ఆందోళన చేపట్టింది.
గురువారం ఉదయం పార్లమెంట్ ప్రాంగణంలో ప్రతిపక్ష నేతలు దీనిపై నిరసన చేపట్టారు. గ్యాస్ కొరత సమస్యను త్వరగా పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా ఈ నిరసనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్రంపై విమర్శలు గుప్పించారు. ‘‘దేశంలో చమురు కొరతపై కేంద్రం త్వరగా స్పందించాలి. సంక్షోభంగా మారకముందే మేల్కోవాలి. కేంద్ర విదేశాంగ విధానం మారాలి. దేశంలో గ్యాస్ ఒక ప్రాబ్లం. చమురు ఒక ప్రాబ్లం. పెట్రోల్ ఒక ప్రాబ్లం. ఎందుకంటే మనం ఇంధన భద్రతలో రాజీపడ్డాం. లోపాలతో కూడిన విదేశాంగ విధానమే ఇందుకు కారణం. చమురు సమస్యపై ముందు జాగ్రత్త అవసరం. ప్రధాన మంత్రి, ప్రభుత్వం దీనిపై త్వరగా స్పందించాలి. ప్రజలపై భారం పడకుండా చూడాలి. నేను ఇలాంటి అంశాలపై మాట్లాడటానికి ఒక విధానం ఉంటుంది.
ఎల్పీజీ, గ్యాస్, ఆయిల్ సమస్యపై నేను మాట్లాడాలి. కానీ, ఇప్పుడు ఇలా మాట్లాడటానికి కొత్త విధానం తీసుకొచ్చారు. ముందుగా దీనిపై మంత్రి నిర్ణయం తీసుకుంటారు. తర్వాత నేను మాట్లాడుతా. ఆ తర్వాత మంత్రి సమాధానం ఇస్తారు. ఈ విషయంలో ఏం జరుగుతుందో చూడాలి’’ అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాల నిరసనలో కాంగ్రెస్‌తోపాటు డీఎంకే, టీఎంసీ, ఎస్పీ సహా ఇతర పార్టీలకు చెందిన ఎంపీలు పాల్గొన్నారు. ప్రతిపక్ష మహిళా ఎంపీ ప్రియాంకా గాంధీ కూడా దేశంలో చమురు కొరతపై వంట స్టవ్ వద్ద కూర్చుని నిరసన వ్యక్తం చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalyana Lakshmi | పెండ్లయి పిల్లలు పుట్టాక కల్యాణ లక్ష్మి చెక్కు ఇస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం : వీడియో
NZvIND: సీఫర్ట్పైకి దూసుకెళ్లిన బ్రార్ .. భారత బౌలర్‌ను నియంత్రించిన కోహ్లీ
Anirudh-Kavya | ట్రెండ్‌గా మారిన అనిరుధ్-కావ్య వివాహ పద్ధతి.. అసలు ఏంటీ ‘సెల్ఫ్ రెస్పెక్ట్ మ్యారేజ్’?
Kiran Abbavaram | ‘రియాలిటీ’లో రఘుకుల తిలక పాట.. రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చిన కిరణ్ అబ్బవరం
IND vs NZ | విల్ యంగ్ విధ్వంసం.. భారత్ ముందు 334 పరుగుల భారీ లక్ష్యం!
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

