జైపూర్: టోల్ ప్లాజా వద్ద ఒక లారీ ఆగింది. ఉన్నట్టుండి దాని టైరు పేలింది. టోల్ బూత్ క్యాబిన్లో కూర్చొన్న సిబ్బందిపై విరిగిన విండో పడింది. అతడికి తృటిలో ప్రాణాపాయం తప్పింది. (Truck’s Tyre Bursts At Toll Booth) సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో ఈ సంఘటన జరిగింది. శనివారం జైపూర్ జిల్లాలోని హింగోనియా టోల్ ప్లాజాలోని గేట్ 6 వద్ద ఒక లారీ ఆగింది. అయితే ఉన్నట్టుండి దాని టైరు పేలింది.
కాగా, లారీ టైరు పేలుడు ధాటికి టోల్ ప్లాజా క్యాబిన్‌కు ఉన్న విండో ఊడింది. లోపల కంప్యూటర్ వద్ద పని చేస్తున్న సిబ్బందిపై అది పడింది. దీంతో అతడు క్యాబిన్ నుంచి బయటకు పరుగుతీశాడు. అయితే అతడు సురక్షితంగా బయటపడ్డాడు. ఈ సంఘటనలో కంప్యూటర్ కూడా ధ్వంసమైంది.
మరోవైపు లారీ టైరు పేలిన శబ్దం విని అక్కడున్న వారు భయాందోళన చెందారు. ఏం జరిగిందో తెలియక గందరగోళానికి గురయ్యారు. అయితే ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరుగలేదు. ఆ టోల్ ప్లాజా వద్ద ఉన్న సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
जयपुर में हिंगोनिया टोल प्लाजा पर धमाके का CCTV
ट्रक का टायर फटने के बाद हुआ जोरदार विस्फोट
धमाके से बूथ के शीशे, कम्प्यूटर हुए चकनाचूर
बाल-बाल बचा टोलकर्मी
टोल प्लाजा बूथ नंबर-6 पर शनिवार शाम 4 बजे हुआ हादसा pic.twitter.com/c0XbKAbF6R
— Rahul Chauhan (@journorahull) September 14, 2025
Also Read:
Asaduddin Owaisi | 26 మంది ప్రాణాల కంటే డబ్బు విలువైనదా?.. భారత్, పాక్ మ్యాచ్‌పై అసదుద్దీన్ ఆగ్రహం
Couple Kills Children, Plan To Suicide | సూసైడ్ ప్లాన్‌లో పిల్లలు, భర్త మృతి.. బతికిన భార్య