తిరువనంతపురం: కొందరు వ్యక్తులు గే డేటింగ్ యాప్‌లో (Gay Dating App) బాలుడికి పరిచయమయ్యారు. ఈ నేపథ్యంలో సుమారు 16 మంది అతడిపై లైంగికదాడులకు పాల్పడ్డారు. రాజకీయ నాయకుడు, ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు, ఫుట్‌బాల్ కోచ్ కూడా నిందితుల్లో ఉన్నారు. కేరళలోని కాసర్గోడ్ జిల్లాకు చెందిన 16 ఏళ్ల బాలుడు పదో తరగతి చదువుతున్నాడు. రెండేళ్ల కిందట మొబైల్ ఫోన్లో గే డేటింగ్ యాప్‌ను అతడు డౌన్లోడ్ చేశాడు. దీంతో కొందరు వ్యక్తులు పరిచయమయ్యారు. కాసర్గోడ్, కన్నూర్, కోజికోడ్, ఎర్నాకుళం జిల్లాలకు చెందిన 16 మంది మగవారు రెండేళ్లుగా ఆ యువకుడితో లైంగిక చర్యలకు పాల్పడ్డారు.
కాగా, కొందరు వ్యక్తులు ఆ బాలుడి ఇంటిని తరచుగా సందర్శించేవారు. ఒక రోజు బయటకు వెళ్లిన యువకుడి తల్లి ఇంటికి తిరిగి రావడం చూసి ఒక వ్యక్తి పారిపోయాడు. ఆ వ్యక్తి తీరుపై అనుమానించిన ఆ మహిళ తన కుమారుడ్ని ప్రశ్నించింది. దీంతో జరిగిన విషయం చెప్పాడు. ఈ నేపథ్యంలో బాలుడి తల్లి వెంటనే చైల్డ్ హెల్ప్‌లైన్‌ను సంప్రదించింది. వారి అలెర్ట్‌తో పోలీసులు రంగంలోకి దిగారు.
మరోవైపు పోలీసులు ఆ బాలుడి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. పోక్సో చట్టం కింద 16 మంది వ్యక్తులపై వేర్వేరుగా 14 కేసులు నమోదు చేశారు. కాసరగోడ్ జిల్లాలో జరిగిన ఎనిమిది కేసుల దర్యాప్తు కోసం డీఎస్పీ, నలుగురు ఎస్ఐల నేతృత్వంలో ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. మిగిలిన ఆరు కేసులను దర్యాప్తు కోసం కోజికోడ్, కన్నూర్ జిల్లాలకు బదిలీ చేశారు.
కాగా, నిందితుల్లో 14 మంది వ్యక్తులు 25 నుంచి 51 ఏళ్ల వయస్కులని పోలీస్ అధికారి తెలిపారు. వీరిలో రాజకీయ నాయకుడు, రైల్వే ఉద్యోగితో సహా ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు, ఫుట్‌బాల్ కోచ్‌తో పాటు 9 మందిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. ఆ గే డేటింగ్ యాప్‌పై కూడా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.
Also Read:
Protesters Garland Potholes | ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి.. గుంతలకు దండలు వేసి నిరసన
Watch: టోల్ ప్లాజా వద్ద పేలిన లారీ టైరు.. తర్వాత ఏం జరిగిందంటే?