– పీఓ కార్యాలయం వద్ద కార్మికుల నిరసన
టేకులపల్లి, ఫిబ్రవరి 25 : గత కొన్ని రోజులుగా కోయగూడెం ఓసీ ప్రాజెక్ట్ ఆఫీసర్పై విమర్శలు వస్తున్నాయి. మూడు రోజుల క్రితం విధుల్లో ఉన్న ఓ ఓర్మెన్ పట్ల కోయగూడెం ఓసి ప్రాజెక్టు ఆఫీసర్ అసభ్యకరంగా దూషించడంతో బుధవారం కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం కేఓసీ ప్రాజెక్టు కార్యాలయం ఎదుట కార్మికులు సుమారు గంటకు పైగా ఆందోళన నిర్వహించి ప్రాజెక్టు అధికారి క్షమాపణ చెప్పాలంటూ ఆందోళనకు దిగారు. మంగళవారం ప్రాజెక్ట్ అధికారి లేకపోవడంతో తిరిగి బుధవారం కార్మిక సంఘాల నాయకులు ఓర్మెన్ దూషించిన విషయమై చర్చలు జరిపారు.
బొగ్గు ఉత్పత్తి, రవాణాలో విఫలం కావడంతో పాటుగా వే బ్రిడ్జిలు తలెత్తిన సాంకేతిక తప్పిదాన్ని సకాలంలో గుర్తించడంలో నిర్లక్ష్యం వహించడంతో పాటుగా విధుల్లో ఉన్న కార్మికుల పట్ల , నిర్వాసిత ఆదివాసీల పట్ల కేఓసి పిఓ అనుసరిస్తున్న వైఖరిపై సర్వాత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టార్పాలిన్ కార్మికులపై దుర్భాషలాడినందుకు ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య వద్దకు విషయాన్ని తీసుకెళ్లి కేఓసి పీఓ మాట్లాడారు. సింగరేణి సిఎండి కోయగూడెం ప్రాజెక్టు అధికారిపై చర్యలు తీసుకోవాలని కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై కేఓసీ పీఓ వివరణ కోసం ఫోన్ చేయగా స్పందించలేదు.