బీబీనగర్, ఫిబ్రవరి 27 : శ్రీ లక్ష్మీనరసింహస్వామి డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్–3 ఆధ్వర్యంలో బీబీనగర్ మండలం గూడూరు గ్రామంలో నిర్వహిస్తున్న ప్రత్యేక శీతాకాల శిబిరంలో భాగంగా మూడో రోజు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామంలోని హైస్కూల్ ప్రాంగణంలో పిచ్చి మొక్కలను తొలగించి, చెత్తా చెదారం తొలగిస్తూ పరిసరాలను శుభ్రం చేశారు. అనంతరం పాఠశాల విద్యార్థులకు రాబోయే పదో తరగతి పరీక్షలకు ఎలా సిద్ధం కావాలి, పరీక్షలు ఎలా రాస్తే మంచి మార్కులు సాధించవచ్చో వివరించి అవగాహన కల్పించారు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించేలా సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బింగి అలివేలుమంగ శ్రీనివాస్, ఎన్ఎస్ఎస్ యూనిట్–3 ప్రోగ్రాం ఆఫీసర్ ఎండీ ఏథర్ ఫరీన్, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.