శాన్ డిగో: అమెరికా(United States) ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. మెక్సికోలోని సినలోవా కార్టెల్‌ను నిర్వహిస్తున్న ఇద్దరు అన్నాదమ్ములను పట్టిస్తే కోటి డాలర్లు నజారానా ఇవ్వనున్నట్లు వెల్లడించింది. సినలోవా డ్రగ్ ముఠాకు చెందిన 42 ఏళ్ల రీని అర్జేట్ గార్సియాతో పాటు 52 ఏళ్ల ఆల్ఫాన్సో ఆర్జేట్ గార్సియా ఆ లిస్టులో ఉన్నారు. రీని అర్జేట్ను లా రాణా.. ద ఫ్రాగ్‌గా పిలుస్తారు. అల్ఫోన్సోను అచిలిస్గా పిలుస్తున్నారు. శాన్ డిగోలో జరుగుతున్న డ్రగ్ నేరాల్లో ఈ ఇద్దరి పాత్ర ఉన్నది. వీరిపై నార్కోటెర్రరిజం కేసులు ఉన్నాయి. ఒక్కొక్కరిపై అమెరికా ప్రభుత్వం 5 మిలియన్ల డాలర్ల నజరానా ప్రకటించింది. కాలిఫోర్నియా, మెక్సికో బోర్డర్ సమీపంలో సినలోవా, జాలిసికో డ్రగ్ ముఠాల మధ్య వార్ నడుస్తోంది. అయితే నాలుగు రోజుల క్రితమే జాలిసికో న్యూ జనరేషన్ కార్టల్ లీడర్ ఎల్ మెంచోను మెక్సిన్ ఆర్మీ హతమార్చిన విషయం తెలిసిందే.