Dhanush | ధనుష్‌తో మళ్లీ నటించాలని ఉంది అంటూ సంయుక్త మీనన్ ఆసక్తికర వ్యాఖ్యలు
Dhanush | సౌత్ సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ హీరోయిన్లలో ఒకరిగా ఎదిగిన సంయుక్త మీనన్, తన నటనతో పాటు పాత్రల ఎంపికలోనూ ప్రత్యేకత చూపిస్తూ వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. కేవలం గ్లామర్ పాత్రలకు మాత్రమే పరిమితం కాకుండా, కథా బలమున్న సినిమాలను ఎంచుకుంటూ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
Dhanush | సౌత్ సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ హీరోయిన్లలో ఒకరిగా ఎదిగిన సంయుక్త మీనన్, తన నటనతో పాటు పాత్రల ఎంపికలోనూ ప్రత్యేకత చూపిస్తూ వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. కేవలం గ్లామర్ పాత్రలకు మాత్రమే పరిమితం కాకుండా, కథా బలమున్న సినిమాలను ఎంచుకుంటూ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. మలయాళ సినిమా పాప్‌కార్న్ ద్వారా 2016లో సినీ ప్రయాణం ప్రారంభించిన సంయుక్త, అతి తక్కువ సమయంలోనే తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. టాలీవుడ్లో ఆమె ఎంట్రీ భీమ్లా నాయక్ సినిమాతో జరిగింది. ఇందులో పవన్ కళ్యాణ్ సరసన నటించి మంచి గుర్తింపు సంపాదించారు.
అనంతరం బింబిసార, సార్, విరూపాక్ష వంటి వరుస హిట్ చిత్రాలతో సంయుక్త స్టార్ హీరోయిన్గా ఎదిగారు. ఈ సినిమాల విజయాల తర్వాత ఆమెను టాలీవుడ్లో ‘లక్కీ బ్యూటీ’గా పిలవడం ప్రారంభమైంది. వైవిధ్యమైన పాత్రలను ఎంచుకోవడమే ఆమె సక్సెస్ రహస్యం అని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో, ధనుష్ తో కలిసి పని చేసిన అనుభవాన్ని సంయుక్త గుర్తు చేసుకున్నారు. సార్ చిత్రంలో ఆయన సరసన నటించిన ఆమె, ధనుష్‌ను ప్రశంసలతో ముంచెత్తారు. ధనుష్‌తో పనిచేయడం నాకు ఒక గొప్ప పాఠం లాంటిది. ఆయన సెట్లో చాలా తక్కువగా మాట్లాడతారు. కానీ కెమెరా ముందుకు వచ్చేసరికి తన పూర్తి శక్తిని చూపిస్తారు. ఒక స్క్రిప్ట్‌ను ఆయన ఎంచుకుంటే అందులో తప్పకుండా ప్రత్యేకత ఉంటుంది అని ఆమె పేర్కొన్నారు.
అంతేకాకుండా, భవిష్యత్తులో మళ్లీ ధనుష్‌తో కలిసి నటించాలని తన కోరికను వ్యక్తం చేశారు. తాను మళ్లీ స్క్రీన్ షేర్ చేయాలనుకునే నటుల జాబితాలో ధనుష్ ఎప్పుడూ ముందువరుసలో ఉంటారని స్పష్టం చేశారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన సార్ (తమిళంలో ‘వాతి’) చిత్రం 2023లో విడుదలై ఘనవిజయం సాధించింది. ఈ సినిమాలో సంయుక్త ‘మీనాక్షి’ అనే బోటనీ లెక్చరర్ పాత్రలో ఒదిగిపోయి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. విద్యా వ్యవస్థలో ఉన్న అసమానతలను ప్రతిబింబిస్తూ, పేద విద్యార్థుల కోసం పోరాడే జూనియర్ లెక్చరర్ కథగా ఈ చిత్రం మంచి స్పందన పొందింది. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో విడుదలై ₹100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. జీవీ ప్రకాష్ కుమార్ అందించిన సంగీతం కూడా సినిమాకు పెద్ద ప్లస్ అయింది. ముఖ్యంగా ‘మాస్టారు మాస్టారు’ పాట భారీ హిట్‌గా నిలిచింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Iran | బాలిస్టిక్ మిస్సైల్స్‌పై పరిమితిని ఎత్తేశాం.. ఇరాన్ కీలక ప్రకటన..!
Agriculture Student | మీరు ప్రొఫెసర్లా.. ప్రొఫెసర్ల ముసుగులో ఉన్న బ్రోకర్లా..? : అగ్రికల్చర్ వర్సిటీ విద్యార్థి ఫైర్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

