Gaza | గాజాలో శవయాత్ర.. కంటతడి పెట్టిస్తున్న చిన్న పిల్లల బొమ్మలాట
Gaza | గాజాలో కొందరు చిన్నపిల్లలు తమ బొమ్మతో సరదాగా ఆడిన ఆట చూపరులకు కంటతడి పెట్టిస్తూ అక్కడి విషాద పరిస్థితులకు అద్దం పడుతున్నది.
Gaza | గాజా సిటీ: గాజాలో కొందరు చిన్నపిల్లలు తమ బొమ్మతో సరదాగా ఆడిన ఆట చూపరులకు కంటతడి పెట్టిస్తూ అక్కడి విషాద పరిస్థితులకు అద్దం పడుతున్నది. కొంతమంది పిల్లలు కలిసి ఒక బొమ్మను పాడెపై శవాన్ని ఎత్తినట్టు అతి జాగ్రత్తగా పైకెత్తి చిన్న స్ట్రెచ్చర్‌పై ఉంచి, శవయాత్ర మాదిరిగా దానిని మోస్తూ మెల్లిగా నడుస్తుండగా, మరికొందరు మౌనంగా నడుస్తూ వెళ్తున్న వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.
ఒక శవయాత్ర పిల్లలకు కొత్త ఆటలా మారిందంటే గాజాలో నెలకొన్న విషాదం, శవయాత్రలు వారికి నిత్యకృత్యంగా మారిన పరిస్థితులను అర్థం చేసుకోవచ్చు. ఇజ్రాయెల్ దాడులతో ప్రతి రోజూ పదుల సంఖ్యలో పౌరులు మరణించడం, వారి అంతిమ యాత్రలు నిత్యకృత్యంగా మారడంతో పిల్లలు ఈ అంతిమయాత్రనే ఒక కొత్త ఆటగా భావించి ఆనందపడటం నిజంగా దురదృష్టమే.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

