నీట్ విద్యార్థుల రిజిస్ట్రేషన్‌కు నోటిఫికేషన్
నీట్- 2026లో అర్హత సాధించిన విద్యార్థుల రిజిస్ట్రేషన్ కోసం కాళోజీ హెల్త్ యూనివర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సులకు రిజిస్ట్రేషన్ ఈ నెల 5 ఉదయం 6 నుంచి 12వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు యూనివర్సిటీ వెబ్సైట్లో సర్టిఫికెట్లు అప్లోడ్ చేసుకోవాలని యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ నాగార్జునరెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
హైదరాబాద్/వరంగల్‌చౌరస్తా, ఆగస్టు 4 : నీట్- 2026లో అర్హత సాధించిన విద్యార్థుల రిజిస్ట్రేషన్ కోసం కాళోజీ హెల్త్ యూనివర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సులకు రిజిస్ట్రేషన్ ఈ నెల 5 ఉదయం 6 నుంచి 12వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు యూనివర్సిటీ వెబ్సైట్లో సర్టిఫికెట్లు అప్లోడ్ చేసుకోవాలని యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ నాగార్జునరెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
రిజిస్ట్రేషన్ సమయంలో నీట్ ర్యాంక్ కార్డుతోపాటు బర్త్ సర్టిఫికెట్, ఇంటర్ లేదా 10+2 విద్యార్హతల సర్టిఫికెట్లు, స్టడీ సర్టిఫికెట్, ఈడబ్ల్యూఎస్ అర్హత కలిగిన విద్యార్థులు 2026-27 వార్షిక సంవత్సరానికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు, ఇతర అర్హత ఉన్న విద్యార్థులు ప్రభుత్వం అనుమతించిన కోటాలో సీటు పొందడానికి ఆయా సర్టిఫికెట్లను అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నారు. ఓసీ, బీసీ విద్యార్థులు రూ.4 వేలు, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.3,200 నాన్ రిఫండబుల్ ఫీజు చెల్లించాల్సి ఉంటుందని, ఈ ఫీజును డెబిట్ లేదా క్రెడిట్ కార్డు ద్వారా మాత్రమే స్వీకరిస్తారని తెలిపారు.
యూనివర్సిటీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కోసం 7901098840, 9490585796, టెక్నికల్ సమస్యల పరిష్కారమార్గాల కోసం 9392685856, 9095672216, 7842136688, ఫీజు చెల్లింపుల కోసం 9618240276, వెరిఫికేషన్ సమస్యల పరిష్కారం కోసం 9866092370 ఫోన్ నంబర్లలో కార్యాలయ పనిదినాల్లో ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5గంటల వరకు సంప్రదించవచ్చని వెల్లడించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

