హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ఎకల్షన్ పిటిషన్లు దాఖలు చేసిన కాంగ్రెస్ అభ్యర్థి కేకే మహేందర్‌రెడ్డి, లగిశెట్టి శ్రీనివాసులు కు చుక్కెదురైంది. వారి పిటిషన్లను హై కోర్టు కొట్టివేసింది. ఈ మేరకు జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు మంగళవారం తీర్పు వెలువరించారు. ప్రజాప్రతినిధుల ఎన్నికను సవాలు చేస్తూ పిటిషన్లు దాఖలు చేసేవారు బలమైన సాక్ష్యాధారాలపై ఆధారపడాలని స్ప ష్టం చేశారు.
అవినీతికి పాల్పడి ఉండవచ్చన్న ఊహాగానాలు లేదా సాధార ణ ఆరోపణలతో దాఖలు చేసే ఎన్నికల పిటిషన్లను అనుమతించలేమని పేర్కొన్నారు. ప్రజాప్రతినిధుల ఎన్నికను రద్దు చేయాలంటే స్పష్టమైన ఆధారాలు తప్పనిసరిగా ఉండాలని తేల్చిచెప్పారు. కొడుకు పేరుతో జరిగిన ఆస్తుల కొనుగోలు వివరాలను ఎన్నిక ల అఫిడవిట్లో వెల్లడించలేదన్న ఒక కారణంతోనే కేటీఆర్ అవినీతికి పాల్పడినట్టు నిర్ధారించలేమని పేర్కొన్నారు. కేటీఆర్‌పై చేసిన అవినీతి ఆరోపణలకు పిటిషనర్లు ప్రత్యక్ష ఆధారాలను సమర్పించనందున వారి వ్యాజ్యాలను కొట్టివేస్తున్నట్టు ప్రకటించారు.