డ్రగ్స్ రహిత సమజాన్ని నిర్మిద్దాం
మాదక ద్రవ్య రహిత సమాజం నిర్మించేందుకు ప్రతి ఒకరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. మంగళవారం నల్లగొండ ఎన్జీ కళాశాలలో నిర్వహించిన ‘10 కోట్ల మాదక ద్రవ్య రహిత ప్రతిజ్ఞ’ మెగా ప్రచార కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత డ్రగ్స్, మద్యం, సిగరెట్ తదితర వ్యసనాలకు బానిసలుగా మారడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు.
- యువత వ్యసనాలకు దూరంగా ఉండాలి
- ఎన్జీలో నిర్వహించిన సదస్సులో కలెక్టర్ బి. చంద్రశేఖర్
రామగిరి, ఆగస్టు 4: మాదక ద్రవ్య రహిత సమాజం నిర్మించేందుకు ప్రతి ఒకరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. మంగళవారం నల్లగొండ ఎన్జీ కళాశాలలో నిర్వహించిన ‘10 కోట్ల మాదక ద్రవ్య రహిత ప్రతిజ్ఞ’ మెగా ప్రచార కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత డ్రగ్స్, మద్యం, సిగరెట్ తదితర వ్యసనాలకు బానిసలుగా మారడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు.
ఒకప్పుడు కేవలం డబ్బున్న వారికి మాత్రమే అందుబాటులో ఉండే డ్రగ్స్, ఇప్పుడు అందరికీ అందుబాటులోకి రావడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ, దీనికి వ్యవస్థతో పాటు ప్రతి ఒకరూ బాధ్యత వహించాలరు. మాదక ద్రవ్యాల బారిన పడి తమ జీవితాలను, కెరీర్‌ను నాశనం చేసుకుంటున్నామని యువత తెలుసుకోవాలన్నారు. డ్రగ్స్‌కు అలవాటు పడితే వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా, సామాజికంగా తీవ్ర ప్రభావం పడుతుందని, ఒక దశలో తీవ్ర ఏకాకితనం ఆవహిస్తుందన్నారు. ఎవరైనా మాదక ద్రవ్యాల బారిన పడినా, విక్రయించినా చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తమ చుట్టుపకల ఎవరైనా డ్రగ్స్ తీసుకున్నా, విక్రయించినా తక్షణమే 1908 టోల్ ఫ్రీ నెంబర్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు.
ఇప్పటివరకు నల్లగొండ జిల్లాలో 97 డ్రగ్స్ కేసులు నమోదయ్యాయని తెలిపారు. ప్రస్తుత జెన్‌జీ తరం డ్రగ్స్ ఫ్రీ తరంగా నిలవాలని ఆకాంక్షించారు. సామాజిక బాధ్యతతో ముందుకు వచ్చిన ప్రజాపిత బ్రహ్మకుమారీస్ సంస్థతో పాటు ఎన్జీ కళాశాల ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ విభాగాలను ఆయన అభినందించారు. అనంతరం మాదక ద్రవ్యాల నిరోధక పోస్టర్‌ను ఆవిషరించారు. కార్యక్రమంలో అదనపు పోలీసు సూపరింటెండెంట్ రమేష్ విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సముద్రాల ఉపేందర్, బ్రహ్మకుమారి రాజయోగి ధనలక్ష్మి, జిల్లా సంక్షేమ అధికారి కృష్ణవేణి, డిప్యూటీ డీఎమ్హెచ్వో నగేష్, లయన్స్ క్లబ్ జిల్లా గవర్నర్ ఆర్. మదన్ మోహన్, శ్రీధర్, బ్రహ్మకుమారీస్ ప్రతినిధి కుమారి మోనిక, ఎన్సీసీ ఆఫీసర్ లెఫ్టినెంట్ సీహెచ్. సుధాకర్, ఎన్ఎస్ఎస్ ఆఫీసర్లు వెంకట్ రెడ్డి, అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RRB Jobs | రైల్వేలో 3548 నాన్ టెక్నికల్ గ్రాడ్యుయేట్ ఖాళీలు.. నోటిఫికేషన్ విడుదల చేసిన ఆర్ఆర్బీ
Alias Rukmini | ఆసక్తి రేపుతున్న నితిన్, నానిల ‘అలియాస్ రుక్మిణి’.. డిసెంబర్ 4న థియేటర్లలో సందడి!
Gaurav Yadav: పంజాబ్ డీజీపీగా గౌరవ్ యాదవ్ నియామకం
Anchor Manjusha | మంజూష అందాల విందు.. చీరకట్టులో మెరిసిపోతున్న యాంకర్!
Ranabaali | యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తున్న విజయ్ దేవరకొండ ‘రణబాలి’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

