ఆటో డ్రైవర్లను మోసం చేసిన కాంగ్రెస్
హామీలను అమలు చేయకుండా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అరచేతిలో వైకుంఠం చూపిస్తూ మోసం చేస్తుందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణయ్య విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ తమ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నట్లుగా ప్రతి ఆటో డ్రైవర్‌కు సంవత్సరానికి రూ.12వేలు ఆర్థిక సహాయం అందజేయాలని డిమాండ్ చేశారు.
- బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య
కవాడిగూడ/రవీంద్రభారతి, సెప్టెంబర్ 15 : హామీలను అమలు చేయకుండా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అరచేతిలో వైకుంఠం చూపిస్తూ మోసం చేస్తుందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణయ్య విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ తమ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నట్లుగా ప్రతి ఆటో డ్రైవర్‌కు సంవత్సరానికి రూ.12వేలు ఆర్థిక సహాయం అందజేయాలని డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్ల కోసం వెంటనే సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి ఆదుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. తెలంగాణ యునైటెడ్ ఆటో ఓనర్స్ అడ్ డ్రైవర్స్ అసోసియేషన్స్, నాన్ పొలిటికల్ ఆటో జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం ఇందిరాపార్కు వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణయ్య, మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు నల్లాల కనకరాజు, ఆటో జేఏసీ అధ్యక్షుడు మంద రవికుమార్, ప్రధాన కార్యదర్శి సాయిలు, ఉపాధ్యక్షుడు దస్తగిరి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ ఉచిత బస్సుతో ఆర్థిక ఇబ్బందులకు గురై ఆత్మహత్యలకు పాల్పడ్డ ఆటో డ్రైవర్ల కుటుంబాలకు ప్రభుత్వం 25 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించాలన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్‌గా తీసుకుని ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ఆటో జేఏసీ అధ్యక్షుడు రవికుమార్, ప్రధాన కార్యదర్శి సాయిలు బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అంజి పాల్గొన్నారు.అలాగే ఫీజు రీయింబర్స్మెం ట్,బీసీల సమస్యలు పరిష్కరించాలని ఎంపీ ఆర్ కృష్ణయ్య, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్,కన్జూమర్ రైట్స్ కమిషన్ రాష్ట్ర చైర్మన్ వల్దాస్ చంద్రశేఖర్గౌడ్తో కలిసి అసెంబ్లీలో ముఖ్యమంత్రి చాంబర్లో సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి కోరారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delhi Police | పోలీసులపై దాడులు, అడ్డగింత.. సీజేపీ నిరసనలో 20 ఎఫ్ఐఆర్లు నమోదు
Hanumanthu Naidu | కొత్త జిల్లాల ఏర్పాటుతో విరజిమ్మిన ప్రగతి వెలుగులు : బీఆర్ఎస్ నాయకుడు హనుమంతు నాయుడు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Sunitha Laxma Reddy | రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న కాంగ్రెస్ : ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి
Niranjan Reddy | పాలనా సంస్కరణలలో నూతన ఒరవడి సృష్టించిన కేసీఆర్ : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

