డెహ్రాడూన్: కొండచరియలు విరిగిపడ్డాయి. అయితే ఆ రహదారిపై కాన్వాయ్‌లో వెళ్తున్న బీజేపీ ఎంపీ తృటిలో తప్పించుకున్నారు. (BJP MP Anil Baluni) ఆ రోడ్డుపై కొండచరియలు విరిగిపడిన వీడియో క్లిప్‌ను ఆయన షేర్ చేశారు. ఉత్తరాఖండ్‌లో ఈ సంఘటన జరిగింది. గర్హ్వాల్ బీజేపీ ఎంపీ అనిల్ బలూనీ బుధవారం చమోలి, రుద్రప్రయాగ్‌లోని వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించారు. ఆ తర్వాత రిషికేశ్కు వెళ్లిన ఆయన తన కాన్వాయ్‌లో తిరుగు ప్రయాణమయ్యారు.
కాగా, దేవ్‌ప్రయాగ్ సమీపంలోని బద్రీనాథ్ జాతీయ రహదారిపై కొండచరియలు విరిగిపడటాన్ని బీజేపీ ఎంపీ అనిల్ గమనించారు. వెంటనే తన కాన్వాయ్‌ను నిలిపివేశారు. వాహనం నుంచి దిగిన ఆయన మిగతా వాహనదారులను అప్రమత్తం చేశారు. ఇంతలో భారీగా కొండచరియలు ఆ రహదారిపై విరిగిపడ్డాయి. ఇది చూసి బీజేపీ ఎంపీ అనిల్ కూడా భయాందోళన చెందారు. అక్కడి నుంచి దూరంగా వెళ్లారు. తన వాహనాలను వెనక్కి మళ్లించారు.
మరోవైపు బీజేపీ ఎంపీ అనిల్ బలూనీ ఈ భయానక అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ వీడియో క్లిప్‌ను ఎక్స్‌లో షేర్ చేశారు. ‘ఈ సంవత్సరం ఉత్తరాఖండ్‌లో సంభవించిన తీవ్రమైన వర్షాలు, కొండచరియలు విరిగిపడటం చాలా మందికి లోతైన గాయాలను మిగిల్చాయి. వాటిని నయం చేయడానికి చాలా సమయం పడుతుంది. నిన్న సాయంత్రం, విపత్తు ప్రభావిత ప్రాంతంలో కొండచరియలు విరిగిపడిన భయానక దృశ్యాన్ని మీ అందరితో పంచుకుంటున్నా’ అని పేర్కొన్నారు.
కాగా, ఉత్తరాఖండ్ ఎదుర్కొంటున్న తీవ్రమైన ప్రకృతి వైపరీత్యం గురించి ఇది చాలా చెబుతుందని అనిల్ బలూనీ తెలిపారు. సవాల్‌తో కూడిన పరిస్థితుల్లో రోడ్లపై పేరుకుపోయిన కొండచరియల శిథిలాలు తొలగిస్తున్న కార్మికుల అంకితభావంతో పాటు అధికారులందరినీ అభినందిస్తున్నట్లు వెల్లడించారు.
उत्तराखंड में इस वर्ष आई भीषण अतिवृष्टि और भूस्खलन ने इतने गहरे घाव दिए हैं, जिन्हें भरने में बहुत समय लगेगा।
कल शाम आपदा प्रभावित क्षेत्र में भूस्खलन का एक भयावह दृश्य आप सभी के साथ साझा कर रहा हूं। यह दृश्य स्वयं बता रहा है कि हमारा उत्तराखंड इस समय कितनी भीषण प्राकृतिक आपदा… pic.twitter.com/fdTsXpPsm2
— Anil Baluni (@anil_baluni) September 18, 2025
Also Read:
Woman Throws daughter In Lake | ప్రియుడికి ఇష్టంలేదని.. మూడేళ్ల కుమార్తెను నీటిలో పడేసిన మహిళ
Woman Raped By Husband’s Colleague | మహిళపై భర్త సహోద్యోగి అత్యాచారం.. ఆపై బెదిరింపులు