జైపూర్: ప్రియుడికి ఇష్టంలేదని ఒక మహిళ తన మూడేళ్ల కుమార్తెను నీటి కొలనులో పడేసింది. (Woman Throws daughter In Lake) ఆ చిన్నారి అదృశ్యమైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. మరునాడు నీటి కొలనులో పాప మృతదేహం బయటపడింది. దర్యాప్తు చేసిన పోలీసులు ఆ మహిళను అరెస్ట్ చేశారు. రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో ఈ సంఘటన జరిగింది. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసికి చెందిన 28 ఏళ్ల అంజలి అలియాస్ ప్రియ తన భర్త నుంచి విడిపోయింది. మూడేళ్ల కుమార్తెతో కలిసి అజ్మీర్ చేరుకున్నది. అక్కడ ఓ హోటల్లో రిసెప్షనిస్ట్‌గా ఆమె పనిచేస్తున్నది. అదే హోటల్లో పని చేస్తున్న అల్కేష్తో కలిసి సహజీవనం చేస్తున్నది.
కాగా, మొదటి భర్త ద్వారా జన్మించిన మూడేళ్ల చిన్నారి అంటే అల్కేష్కు ఇష్టంలేదు. దీంతో ఈ విషయంపై అంజలిని అతడు తిట్టసాగాడు. ఈ నేపథ్యంలో తన కుమార్తె అడ్డు తొలగించుకోవాలని ఆమె ప్లాన్ వేసింది. సెప్టెంబర్ 16న రాత్రి వేళ బిడ్డను నిద్రపుచ్చింది. ఆ తర్వాత కుమార్తెను భుజంపై వేసుకుని ఇంటి నుంచి బయటకు వెళ్లింది. సమీపంలోని నీటి కొలనులో ఆ చిన్నారిని పడేసింది.
అనంతరం అల్కేష్కు అంజలి ఫోన్ చేసింది. కుమార్తెతో కలిసి ఇంటి నుంచి బయటకు వచ్చానని, అయితే పాప కనిపించడంలేదని ప్రియుడికి చెప్పింది. దీంతో అతడు ఆ ప్రాంతానికి చేరుకున్నాడు. అర్ధరాత్రి వేళ వారిద్దరూ కలిసి ఆందోళనతో నడిచి వెళ్లడాన్ని పెట్రోలింగ్ పోలీసులు చూశారు. ఆరా తీయగా తన బిడ్డతో బయటకు వచ్చానని, ఉన్నట్టుండి కుమార్తె ఎటో వెళ్లి తప్పిపోయినట్లు అంజలి చెప్పింది.
Woman And Loveer
మరోవైపు పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. అంజలి తొలుత తన బిడ్డను భుజంపై వేసుకుని కొలను వద్ద నడిచి వెళ్లడాన్ని గమనించారు. ఆ తర్వాత ఒంటరిగా ఉన్న ఆమె మొబైల్ ఫోన్లో మాట్లాడటాన్ని చూశారు.
కాగా, బుధవారం ఉదయం నీటి కొలనులో చిన్నారి మృతదేహం కనిపించింది. దీంతో అంజలిపై అనుమానించిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. మొదటి భర్త వల్ల కుమార్తె ఉండటంపై ప్రియుడు అల్కేష్ వేధింపులు భరించలేక నీటి కొలనులో పడేసి చంపినట్లు అంజలి ఒప్పుకున్నదని పోలీస్ అధకారి తెలిపారు. పాప హత్యలో అతడి ప్రమేయం ఉన్నదా? అన్నదానిపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Also Read:
Woman Raped By Husband’s Colleague | మహిళపై భర్త సహోద్యోగి అత్యాచారం.. ఆపై బెదిరింపులు
Teacher Thrashes Students | కాళ్ల మీదపడి మొక్కనందుకు.. విద్యార్థులను కర్రతో కొట్టిన టీచర్