అబ్జ క్రియేషన్స్ సాహిత్య సాంస్కృతిక సంస్థ, అక్షర కుసుమాలు, హైదరాబాద్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో కోడీహళ్ళి ఫణి ప్రసన్న కుమార్ (బెంగళూరు) రచించిన ‘పెన్నిధి’ పద్యకావ్య ఆవిష్కరణ కార్యక్రమం ఈనెల 9వ తేదీ సాయంత్రం 5.30 గంటలకు హైదరాబాద్ సుందరయ్య భవన్లో జరుగుతుంది.
ఈ విషయాన్ని అబ్జ క్రియేషన్స్ సాహిత్య సాంస్కృతిక సంస్థ కార్యదర్శి కోడీహళ్ళి మురళీమోహన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సభకు సినీ గేయకవి, స్వర్ణ నంది పురస్కార గ్రహీత సాదనాల వేంకటస్వామి నాయుడు అధ్యక్షత వహిస్తారని తెలిపారు. విశ్రాంత తెలుగు ఉపన్యాసకుడు డా.వింజమూరి విశ్వనాథమయ్య గ్రంథా న్ని ఆవిష్కరిస్తారని తెలిపారు.