Suryapet | పెట్రోల్ ట్యాంక్‌పై యువకుడిని కూర్చోబెట్టుకుని.. సూర్యాపేటలో బైక్‌పై యువకుల వెకిలి చేష్టలు.. !
Suryapet | సూర్యాపేట గవర్నమెంట్ జూనియర్ కాలేజీ రోడ్డులో ఓ యువకుడిని పెట్రోల్ ట్యాంక్‌పై కూర్చోబెట్టి మరో యువకుడు బైక్ నడిపిన ఘటన చర్చనీయాంశంగా మారింది.
Suryapet | సూర్యాపేట జిల్లా కేంద్రంలో యువకుల వెకిలి చేష్టలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. గవర్నమెంట్ జూనియర్ కాలేజీ రోడ్డులో ఓ యువకుడిని బైక్ పెట్రోల్ ట్యాంక్‌పై కూర్చోబెట్టుకుని మరో యువకుడు బైక్ నడిపిన ఘటన స్థానికుల దృష్టిని ఆకర్షించింది.
సాధారణంగా బైక్ సీటుపై కూర్చొని ప్రయాణించాల్సిన వ్యక్తిని పెట్రోల్ ట్యాంక్‌పై కూర్చోబెట్టి వాహనం నడపడం ప్రమాదకరమని స్థానికులు చెబుతున్నారు. బైక్ అదుపుతప్పినా, ఎదురుగా వాహనం వచ్చినా ఇద్దరూ కిందపడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గవర్నమెంట్ జూనియర్ కాలేజీ రోడ్డులోనే కాకుండా పట్టణంలోని పలు ప్రాంతాల్లో కొందరు యువకులు బైక్‌లపై విన్యాసాలు చేస్తూ, ర్యాష్‌గా డ్రైవింగ్ చేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. రోడ్లపై వేగంగా బైక్‌లు నడపడం, ప్రమాదకరంగా ప్రయాణించడం వల్ల ఇతర వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొంటున్నారు.
బహిరంగ రహదారులపై ఇలాంటి ప్రమాదకర డ్రైవింగ్‌ను నియంత్రించేందుకు ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు. గవర్నమెంట్ జూనియర్ కాలేజీ రోడ్డు పరిసరాల్లో నిఘా పెంచి, నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
సూర్యాపేటలో బైక్‌పై యువకుల వెకిలిచేష్టలు
గవర్నమెంట్ జూనియర్ కాలేజీ రోడ్డులో ఓ యువకుడిని పెట్రోల్ ట్యాంక్‌పై కూర్చోబెట్టి బైక్ డ్రైవ్ చేసిన మరో యువకుడు
అలానే నిత్యం యువకులు బైక్‌లపై విన్యాసాలు చేస్తూ, ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ఇబ్బందులు కలిగిస్తున్నారని, వీరిపై ట్రాఫిక్ పోలీసులు… pic.twitter.com/aWiyxb0cnP
— Telugu Scribe (@TeluguScribe) October 2, 2026
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Muskan Rastogi | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. జైలులోనే నిందితురాలు, 10 నెలల కూతురు.. చిన్నారి దత్తత కోరుతూ పిటిషన్
Parveta Utsavam | తిరుమలలో ఘనంగా శ్రీమలయప్పస్వామివారి పార్వేట ఉత్సవం
Scene | ‘సీన్’ ప్రమోషన్స్ టైం.. సూర్య టీం ఈవెంట్ ఎక్కడ ప్లాన్ చేసిందో తెలుసా..?
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

