చండీగఢ్: ఆర్మీ బేస్‌పై ఆత్మాహుతి దాడికి ఒక విద్యార్థి ప్లాన్ వేశాడు. ఆన్లైన్లో కెమికల్స్ కొనుగోలు చేశాడు. బాంబు తయారు చేస్తుండగా పేలుడు సంభవించింది. తీవ్రంగా గాయపడిన అతడు చేతిని కోల్పోయాడు. పేలుడుపై పోలీసులు దర్యాప్తు చేయగా ఈ కుట్ర బయటపడింది. (Punjab law student) పంజాబ్‌లోని బతిండా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. జీడా గ్రామానికి చెందిన 19 ఏళ్ల గురుప్రీత్ లా స్టూడెంట్. 12వ తరగతి పరీక్షల్లో 75 శాతం మార్కులు సాధించాడు. స్కూల్లో 90 శాతం హాజరున్న అతడు నిశ్శబ్ద విద్యార్థిగా పేరుగాంచాడు.
కాగా, జాట్ సిక్కు కుటుంబానికి చెందిన గురుప్రీత్, కశ్మీర్ ప్రజలు వేధింపులకు గురవుతున్నారన్న పాకిస్థాన్ వీడియోలకు ప్రభావితమయ్యాడు. జైష్-ఎ-మొహమ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజార్‌కు సంబంధించిన రాడికల్ వీడియోలు మొబైల్ ఫోన్లో చూసేవాడు. దీంతో సొంతంగా తీవ్రవాదం వైపు మళ్లాడు. జమ్ముకశ్మీర్‌లోని కథువాకు వెళ్లి ఆర్మీ శిబిరంపై ఆత్మాహుతి బాంబు దాడి కోసం ప్లాన్ వేశాడు. బాంబు తయారీ కోసం ఆన్లైన్లో కెమికల్స్ కొనుగోలు చేశాడు. సెప్టెంబర్ 11న బస్సులో కథువా వెళ్లేందుకు టికెట్ బుక్ చేసుకున్నాడు.
మరోవైపు సెప్టెంబర్ 10న ఉదయం 6 గంటలకు బాంబు తయారు చేసేందుకు గురుప్రీత్ ప్రయత్నించాడు. కెమికల్స్‌ను కలుపుతుండగా పేలుడు సంభవించింది. దీంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ పేలుడులో గురుప్రీత్ కుడి చేయి తెగింది. ఆ రోజు సాయంత్రం 4.30 గంటల సమయంలో మిగిలిన రసాయనాలు తొలగించేందుకు అతడి తండ్రి జగ్తార్ సింగ్ ప్రయత్నించాడు. దీంతో మరోసారి శక్తివంతమైన పేలుడు సంభవించింది. గురుప్రీత్ తండ్రి కూడా తీవ్రంగా గాయపడ్డాడు. ఆయన ముఖం, కళ్లకు గాయాలయ్యాయి. తండ్రీకొడుకులు ఎయిమ్స్ బతిండాలో చేరారు.
కాగా, సెప్టెంబర్ 11న ఎయిమ్స్ ఆసుపత్రి నుంచి పోలీసులకు ఈ సమాచారం తెలిసింది. దీంతో ఫోరెన్సిక్ బృందాలు ఆ యువకుడి ఇంటికి చేరుకున్నాయి. మరో పేలుడు జరుగుతుందన్న అనుమానంతో ఒక రోజు వరకు ఆ ఇంట్లోకి వెళ్లలేదు. మరునాడు ఆ ఇంటి నుంచి రసాయన నమూనాలను సేకరించారు. కొరియర్ ప్యాకేజీలు, సూసైడ్ జాకెట్‌ను స్వాధీనం చేసుకున్నారు.
మరోవైపు సొంతంగా తీవ్రవాదం వైపు ఆకర్షితుడైన గురుప్రీత్ ఆన్లైన్లో కెమికల్స్ కొనుగోలు కోసం ‘ఇక్బాల్’ పేరుతో నకిలీ గుర్తింపును వినియోగించినట్లు పోలీసులు తెలుసుకున్నారు. అతడు కోలుకున్న తర్వాత మరింతగా ప్రశ్నించడానికి ఎదురుచూస్తున్నారు. పంజాబ్ ఇంటెలిజెన్స్ బ్యూరో, ఎన్ఐఏతోపాటు కథువా పోలీసులు కూడా ఈ కేసు దర్యాప్తులో భాగమయ్యారు.
Also Read:
Woman Raped By Husband’s Colleague | మహిళపై భర్త సహోద్యోగి అత్యాచారం.. ఆపై బెదిరింపులు
Teacher Thrashes Students | కాళ్ల మీదపడి మొక్కనందుకు.. విద్యార్థులను కర్రతో కొట్టిన టీచర్
lawyers thrashed cops | పోలీస్ అధికారిని చుట్టుముట్టి న్యాయవాదులు దాడి.. కోర్టు ప్రాంగణంలో ఘటన
Gay Dating App | గే డేటింగ్ యాప్‌లో పరిచయం.. బాలుడిపై 16 మంది లైంగికదాడి