భువనేశ్వర్: ఒక మహిళపై ఆమె భర్త సహోద్యోగి అత్యాచారానికి పాల్పడ్డాడు. (Woman Raped By Husband’s Colleague) ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే ఆమె భర్తను చంపుతానని బెదిరించాడు. భయపడిన ఆమె కొంతకాలం మౌనంగా ఉన్నది. చివరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఒడిశాలోని బలంగీర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. కాంతాబంజి ప్రాంతంలో నివసించే మహిళ ఇంటికి ఆమె భర్త సహోద్యోగి చింటూ అగర్వాల్ తరచుగా వెళ్లేవాడు. ఆగస్టు 13న రాత్రి 7 గంటల సమయంలో అతడు ఆ ఇంటికి వచ్చాడు. ఆమె భర్త మార్కెట్‌కు వెళ్లినట్లు తెలుసుకున్నాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న ఆ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీని గురించి ఎవరికైనా చెబితే ఆమె భర్తను చంపుతానని బెదిరించాడు.
కాగా, సమాజానికి భయపడిన ఆ మహిళ ఈ విషయంపై నోరెత్తలేదు. అయితే భర్త సహోద్యోగి చింటూ అగర్వాల్ ఆమెను వేధించడంతోపాటు బెదిరించసాగాడు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 11న స్థానిక పోలీస్ స్టేషన్లో ఆ మహిళ ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. అతడ్ని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు.
Also Read:
Watch: నిందితుడి అరెస్ట్‌కు పోలీసులు యత్నం.. దాడి చేసిన అతడి బంధువులు
Teacher Thrashes Students | కాళ్ల మీదపడి మొక్కనందుకు.. విద్యార్థులను కర్రతో కొట్టిన టీచర్
lawyers thrashed cops | పోలీస్ అధికారిని చుట్టుముట్టి న్యాయవాదులు దాడి.. కోర్టు ప్రాంగణంలో ఘటన