రాంచీ: ప్రియురాలిని కలిసేందుకు ప్రియుడు ఆమె గ్రామానికి వెళ్లాడు. అయితే పెళ్లి విషయంపై వీరిద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో ఆ మహిళ కత్తితో ప్రియుడ్ని పొడిచి హత్య చేసింది. (Woman Stabs Boyfriend) ఈ సమాచారం తెలిసిన పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. జార్ఖండ్‌లోని చత్రా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. లతేహర్ జిల్లాలోని ససంగ్ గ్రామానికి చెందిన 34 ఏళ్ల మహ్మమద్ ముంతాజీర్, గురువారం సాయంత్రం చత్రా జిల్లాలోని లామ్టా గ్రామానికి వెళ్లాడు. అక్కడ నివసించే ప్రియురాలైన 24 ఏళ్ల షబ్బు ప్రవీణ్ అలియాస్ నూర్జహాన్ను కలిశాడు. ఈ సందర్భంగా పెళ్లి అంశంపై వారిద్దరి మధ్య గొడవ జరిగింది.
కాగా, ఆగ్రహించిన నూర్జహాన్ ప్రియుడు ముంతాజీర్ను కత్తితో పొడిచింది. తీవ్రంగా గాయపడిన అతడ్ని చికిత్స కోసం చత్రాలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అక్కడి వైద్యులు రాంచీలోని రిమ్స్‌కు రిఫర్ చేశారు. ఈ నేపథ్యంలో అక్కడికి తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించాడు.
మరోవైపు ముంతాజీర్ మరణానికి ముందు అతడి స్టేట్మెంట్ను పోలీసులు రికార్డ్ చేశారు. దీని ఆధారంగా అతడ్ని కత్తితో పొడిచిన ప్రియురాలు నూర్జహాన్పై కేసు నమోదు చేశారు. హత్యకు ఆమె వినియోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. నూర్జహాన్ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు వెల్లడించారు.
Also Read:
DK Shivakumar | ‘ప్రకృతి వల్లే గుంతలు’.. బెంగళూరు రోడ్లపై డీకే శివకుమార్
Residents, Cops Face Off | బెంగళూరులో గుంతల రోడ్లపై జనం నిరసన.. పోలీసులతో ఘర్షణ
Watch: బిల్డింగ్ మూడో అంతస్తు నుంచి కింద పడిన వ్యాపారవేత్త.. వీడియో వైరల్