బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో గంతలమయంగా మారిన రోడ్లపై వస్తున్న విమర్శలపై డిప్యూటీ సీఎం, బెంగళూరు అభివృద్ధి మంత్రి డీకే శివకుమార్ (DK Shivakumar) స్పందించారు. ప్రకృతి వల్లే రోడ్లపై గుంతలు ఏర్పడ్డాయని అన్నారు. శనివారం బెంగళూరులో మీడియాతో డీకే శివకుమార్ మాట్లాడారు. ‘ప్రకృతి వల్లే రోడ్లపై గుంతలు ఏర్పడతాయి. ఎవరూ వాటిని సృష్టించాలని అనుకోరు. బెంగళూరులో వాహనాల పెరుగుదల, భారీ ట్రాఫిక్, అధిక వర్షం కారణంగా మరిన్ని గుంతలు ఏర్పడ్డాయి’ అని అన్నారు.
కాగా, తాము ఇప్పటికే బెంగళూరు రోడ్లపై ఉన్న 7,000కు పైగా గుంతలను పూడ్చినట్లు డీకే శివకుమార్ తెలిపారు. ఇంకా 5,000కు పైగా గుంతలు మిగిలి ఉన్నాయని చెప్పారు. గుంతల పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని పోలీస్ కమిషనర్‌ను కోరామన్నారు.
మరోవైపు వివక్షత లేకుండా బీజేపీ ఎమ్మెల్యేలకూ గ్రాంట్లను విడుదల చేసినట్లు డీకే శివకుమార్ తెలిపారు. వారికి డబ్బు ఇచ్చిన తర్వాత బీజేపీ ఎమ్మెల్యేలు గుంతలను ఎందుకు పూడ్చలేదు? అని ప్రశ్నించారు. ఇప్పుడు కూడా బీజేపీ ఎమ్మెల్యేల కోసం రూ.25 కోట్లు విడుదల చేస్తున్నామని తెలిపారు.
కాగా, రోడ్ల దుస్థితిపై సెప్టెంబర్ 24న బెంగళూరుతో సహా కర్ణాటకలోని అన్ని నియోజకవర్గాల్లో గంట పాటు రోడ్లు బ్లాక్ చేస్తామన్న బీజేపీ ప్రకటనపై డీకే శివకుమార్ స్పందించారు. ‘సమస్యను పరిష్కరించడానికి మేం ఇక్కడ ఉన్నాం. బీజేపీ రాజకీయాలు చేస్తోంది. వారు ఏమి చేయాలనుకుంటే అది చేయనివ్వండి’ అని మీడియాతో అన్నారు.
Also Read:
Residents, Cops Face Off | బెంగళూరులో గుంతల రోడ్లపై జనం నిరసన.. పోలీసులతో
Woman Cop Murdered | మహిళా కానిస్టేబుల్‌తో రహస్య పెళ్లి.. హత్య చేసిన పోలీస్ భర్త
US Woman Murder | పెళ్లి కోసం భారత్ వచ్చిన అమెరికా మహిళ.. హత్య చేసిన కాబోయే భర్త