అమరావతి : ఏపీలోని జనసేన ( Jana Sena ) పార్టీ కార్యాలయంలోకి అజ్ఞాత వ్యక్తి ( Unidentified Person ) చొరబడడం కలకలం సృష్టించింది. విజయవాడలోని మంగళగిరి ( Mangalagiri ) లో ఉన్న జనసేన కేంద్ర కార్యాలయంలోకి శుక్రవారం ఉదయం ఓ అజ్ఞాత వ్యక్తి చొరబడి కార్ల అద్దాలు ధ్వంసం చేశాడు.
భద్రతా సిబ్బంది ఆ వ్యక్తిని పట్టుకుని మంగళగిరి పోలీసులకు అప్పగించారు. పోలీసులు విచారణ జరుపుతున్నారు. విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మంగళగిరి పోలీసు స్టేషన్కు వచ్చి వివరాలు తెలుసుకున్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.