KTR | పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించిన కేటీఆర్, సీతక్క.. వీడియో
KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డాక్టర్లతో మాట్లాడి మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని, ఆయనకు అందుతున్న చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు. కుటుంసభ్యులను పరామర్శించిన కేటీఆర్, మంత్రి సీతక్క వారిలో మనోధైర్యాన్ని నింపారు.
KTR | హైదరాబాద్ : మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని పరామర్శించేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్, మంత్రి సీతక్క యశోద ఆస్పత్రికి చేరుకున్నారు. కేటీఆర్ డాక్టర్లతో మాట్లాడి పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని, ఆయనకు అందుతున్న చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు. కుటుంసభ్యులను పరామర్శించిన కేటీఆర్, మంత్రి సీతక్క వారిలో మనోధైర్యాన్ని నింపారు. కేటీఆర్ వెంట పలువురు బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.
రెండు రోజుల క్రితమే యశోద హాస్పిటల్లో వైద్య పరీక్షలు చేయించుకున్న పెద్దికి ఆదివారం హనుమకొండలోని ఇంట్లో ఉదయం 7 గంటలకు తీవ్రమైన గుండెపోటు రాగా.. ఆయన భార్య స్వప్న వెంటనే దగ్గరలోని రోహిణి హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. కార్డియాలజిస్ట్ మమతారెడ్డి నేతృత్వంలో వైద్యుల బృందం వేగంగా స్పందించి అత్యవసర వైద్యం అందించారు. అత్యవసర సీపీఆర్ అనంతరం మెరుగైన వైద్యం కోసం పెద్ది సుదర్శన్ రెడ్డిని గ్రీన్ ఛానల్ ద్వారా హైదరాబాద్‌లోని యశోద దవాఖానకు తరలించారని తెలిసిందే.
యశోద హాస్పిటల్లో పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చిన కేటీఆర్, సీతక్క, సంజయ్ https://t.co/bpGB1St1PB pic.twitter.com/M9EORDfGs5
— Telugu Scribe (@TeluguScribe) July 27, 2026
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని పరామర్శించడానికి యశోద ఆసుపత్రికి చేరుకున్న కేటీఆర్, సీతక్క, కల్వకుంట్ల సంజయ్ https://t.co/Q0hG0wwNt6 pic.twitter.com/yyg2RY054m
— Telugu Scribe (@TeluguScribe) July 27, 2026
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tushar Gandhi | నిరసనలో పాల్గొనేందుకు వెళ్తుండగా మహాత్మాగాంధీ మునిమనువడు అరెస్ట్..!
Dhruv Rathee | సీజేపీ నిరసనకు వెళ్లకుండా యూట్యూబర్ ధృవ్ రాఠీని అదుపులోకి తీసుకున్న ఢిల్లీ పోలీసులు
Vitamin D | ఎముకలే కాదు, గుండె ఆరోగ్యాన్ని సైతం కాపాడే విటమిన్ డి.. అధ్యయనంలో వెల్లడి..
Gold Locket | శ్రీవారికి బంగారు లాకెట్, ముత్యాలహారం విరాళం
Grammys 2027 | గ్రామీ బరిలో ‘ధురంధర్’ సౌండ్‌ట్రాక్.. ఏకంగా ఎనిమిది కేటగిరీల్లో ఎంట్రీలు!
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

